కీర్తి సురేష్ 'పెంగ్విన్‌' రివ్యూ

First Published Jun 19, 2020, 12:23 PM IST

వరుసగా వస్తున్న ఓటీటి సినిమాలు చూసాక...వాటిపై నమ్మకం మెల్లిగా సడిలిపోతోంది. బిజినెస్ కానివి..ఇందులో స్ట్రీమింగ్ కు ఇచ్చేస్తున్నారా అనే సందేహం వచ్చేలా ఆ సినిమాలు ఉంటున్నాయి.  ఈ నేపధ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ వంటి దర్శకుడు ప్రొడ్యూస్ చేస్తూ, మహా నటితో పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అనగానే ఆశలు చిగిరించాయి.

ఎటుచూసినా అడవే..ఆ వందల ఎకరాల అటవీ ప్రాంతం మద్యలో ఓ హిల్ స్టేషన్. అందులో రిధమ్ (కీర్తి సురేష్) తన రెండో భర్త గౌతం(మదంపట్టి రంగరాజ్)తో జీవిస్తూంటుంది. ఆమె ప్రస్తుతం ఏడో నెల గర్బవతి. అయితే ఆమెను గతం వెంటాడుతూంటుంది. ఆరేళ్ళ క్రితం తన మొదటి భర్త రఘు(లింగా)ద్వారా పుట్టిన అజయ్(మాస్టర్ అద్వైత్) కిడ్నాప్ కు గురి అవుతాడు.
undefined
పోలీస్ లు సాయింతో ఎంత వెతికినా దొరకడు. ఆ కారణంతోటే ఆ సంసారంలో గొడవలు, చివరకు విడాకులు. రిధమ్ సరిగ్గా చూసుకోకపోవటం వల్లే కిడ్నాప్ కు గురి అయ్యాడంటూ ఆమె భర్త నింద వేయటం ఆమె తట్టుకోలేకపోతుంది. మరో ప్రక్క ప్రపంచమంతా ఆ పిల్లాడు చనిపోయాడని నమ్ముతుంది .కానీ రిధంకు ఓ నమ్మకం తనను వెతుక్కుంటూ తన కొడుకు తిరిగి వస్తాడని.
undefined
ఆమె ఆశించినట్లుగానే అనూహ్యంగా ఓ రోజు అజయ్.. రిధంకు దొరుకుతాడు. కాని వాడి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. దాంతో కంగారుపడ్డ ఆమె డాక్టర్ డేవిడ్(మాధి) సాయం కోరుతుంది. ఆ క్రమంలో ఈ ప్రవర్తన వెనక పిల్లలను ఎత్తుకెళ్ళి దారుణంగా హత్య చేసే సైకో కిల్లర్ ఉన్నాడని అర్థమవుతుంది. ఆ కిల్లర్ ..చార్లి చాప్లిన్ మాస్క్ తో ఉంటాడు.
undefined
ఆ మాస్క్ వెనక ఉన్నదెవరు...అనే విషయం కనుక్కోవటం కోసం ఒంటరిగా వేట మొదలుపెడుతుంది రిధం.అలాగే అజయ్‌తో పాటు కిడ్నాప్ కు గురైన మరో ఆరుగురు పిల్లల సంగతి ఏమయ్యింది? తర్వాత ఏం జరిగిందన్నది సస్పెన్స్ తో కూడిన మిగతా కథ.
undefined
స్క్రీన్ ప్లే సంగతిరాక్షసుడు హిట్ తర్వాత థ్రిల్ల‌ర్ జోన‌ర్‌కి మాంచి డిమాండ్ ఏర్ప‌డింది. ఇది వ‌ర‌కు చిన్న హీరోలు, కొత్త హీరోలే ఇలాంటి క‌థ‌లు ఎంచుకునేవారు. ఇప్పుడు ఓ స్థాయి ఉన్న హీరోలూ,హీరోయిన్స్.. చేసేస్తున్నారు. ధ్రిల్ల‌ర్ క‌థ‌ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే ఉండే కిక్కేవేరు.కథా గమనంలో కొన్ని ప్రశ్నలు… వాటిని అన్వేషించేందుకు వీలుగా కొన్ని క్లూలు క‌నిపిస్తాయి.. వాటిని ప‌ట్టుకుని జవాబులను అన్వేషించుకుంటూ సాగిపోవాలి. ఆ జర్నీ ప్రేక్షకుడు బుర్రకి పట్టిందా..ఆ సినిమా తీసినవాడికి బంగారమే.
undefined
అలా థ్రిల్ల‌ర్ సినిమా.. ఓ ప‌జిల్ లా రెడీ చేయాలంటే స్క్రీన్ ప్లే విషయంలో గ్రిప్ట్ ఉండాలి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కొన్ని పాటలు, ఫైట్స్, కామెడీ బిట్స్ తో నింపటానికి కుదరదు. ఊహకు అందకుండా మ‌నం ఛేదించ‌లేని ఓ ప‌జిల్ ఇచ్చి, ద‌ర్శ‌కుడు తాను సాల్వ్ చేస్తూ.. మ‌న‌కు థ్రిల్ కి గురి చేయ‌డ‌మే థ్రిల్ల‌ర్ స్క్రీన్ ప్లే ప్రధమ ల‌క్ష‌ణం. అలా ఈ మిస్టరీ థ్రిల్ల‌ర్‌ కొన్ని ప్ర‌శ్న‌ల్ని రేకెత్తించ‌డం వ‌ర‌కూ బాగుంది. స‌మాధానాలు అన్వేషించేట‌ప్పుడు మాత్రం త‌డ‌బ‌డింది. మెద‌డుకు మేత పెట్టే ప్రాసెస్ లో ఎమోషన్ సీన్స్ ని కలిపేస్తూ తలపోటు పెట్టింది. అయితే ప్రారంభంలోనే ఈ సినిమాలో కంటెంట్ గురించి క్లూ ఇవ్వటం దాకా బాగుంది.
undefined
ఆరేళ్ల బాలుడు కిడ్నాప్‌ అవ్వడం అన్న ప్లాట్‌ను రివీల్‌ చేసి, సినిమా మొత్తం దీని చుట్టూ తిరుగుతుందని క్లూ ఇచ్చేశాడు. దీంతో మనకి మనం ఒక మిస్టరీ థ్రిల్లర్‌ను చూడబోతున్నామన్న క్లారీటీ వచ్చేసింది. అయితే, అదే సమయంలో అదే సమస్య అయ్యి కూర్చుంది. ఆ పిల్లాడిని కిడ్నాప్‌ ఎవరు చేశారన్న ఒక్క పాయింట్‌తోనే రెండు గంటలకు కథను నడిపించాల్సి రావటం స్క్రిప్టుకు మించిన భారం అయ్యిపోయింది.
undefined
ఫస్టాఫ్ హిట్టే కానీ..ఫస్ట్ హాఫ్ సెటప్ బాగుంది కానీ .. కొన్ని సీన్స్ సస్పెన్స్ మెయింటైన్ చేయటం కోసం కన్ ఫ్యూజ్డ్ గా చెప్పటం విసుగెత్తించింది. అలాగే ఏ పాత్రకూ మనని కనెక్ట్ అవ్వనీయకుండా అంతా దాచి పెట్టి నడిపారు. దానికి తోడు స్లో నేరేషన్ . అయితే కంటెంట్ థ్రిల్లర్ జానర్ కాబట్టి స్లోగా ఉన్నా సరే అనుకుని సర్దుకుని ఇంట్రస్ట్ గా చూస్తాము. ఇంటర్వెల్ బాగుంది.
undefined
ఇంక సెకండాఫ్ లో అయితే సినిమాపై దర్శకుడు పట్టు కోల్పోయింది. దాంతో చూసే మనకు మెల్లిగా ఇంట్రస్ట్ పోతుంది. ఒక దాని తర్వాత మరో సీన్ వచ్చి పోతుంది. ఎక్కడా సస్టైన్ అవ్వదు.మనని ఎమోషనల్ గా కనెక్ట్ కానివ్వదు. డాక్టర్ కు కీర్తి సురేష్ మధ్య వచ్చే కాన్వర్షేషన్ అయితే ఎంతకీ అంతం కాదు. అలా సెకండాఫ్ ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్లారు.ఒక్కోసారి అక్కర్లేని డిటైలింగ్ వ‌ల్ల సాగదీత క‌నిపిస్తుంది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ అంత గొప్పగా ఏమీ లేదు. ఓ మాదిరి థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్లు ఇట్టే కనిపెట్టేస్తారు. అలాగే ఈ సినిమా కాన్సెప్టు అసూయ అనేది చాలా సినిమాల్లో చూసినదే. అజయ్‌ను కిడ్నాప్‌ చేయడం వెనుక రీజన్ చాలా సిల్లీగా ఉండి..ఇంత చిన్న కారణానికే పగలు పెంచేసుకుని,కిడ్నాపులు చేస్తారా అనిపిస్తుంది.
undefined
నటీనటులుఈ సినిమాని భారం మొత్తం కీర్తి సురేష్ భుజం మీదే పెట్టి నడిపారు. కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ పాత్రలో బాగానే రాణించింది. అయితే ఏడు నెలల గర్బవతి పాత్ర చేస్తున్నాను అని కొన్ని సార్లు మర్చిపోయిందేమో ..క్యాజువల్ గా నడుచుకుంటూ పోతుంది. ఇక తల్లిగా, నిండు గర్భిణిగా రిథమ్‌ పాత్ర ఈ వయస్సుకే కీర్తి సురేష్ చేయటం మాత్రం గొప్ప విషయం.కిడ్నాపైన బిడ్డ కోసం తల్లి పడే తపనను కీర్తి సురేష్ చక్కగా ప్రదర్శించింది. మిగిలిన నటులు పాత్రల పరిధి మేరకు నటించారు. ఎక్కువ శాతం తమిళ ఆర్టిస్ట్ లే కావటం కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది.
undefined
దర్శకత్వం, మిగతా విభాగాలుకొత్త దర్శకుడు టెక్నికల్ గా తను సౌండ్ అని ప్రూవ్ చేసుకోవటానికి చేసిన ప్రయత్నం చాలా చోట్ల కనపడుతుంది. అదే సమయంలో థ్రిల్లర్ సినిమాలకు స్క్రిప్టు రాసుకునే విషయంలో మరింత కష్టపడాలనే విషయం మర్చిపోయారనిపిస్తుంది. సంతోష్ నారాయన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. థీమ్ కి తగ్గట్టు మంచి స్కోర్ ఇచ్చారు.పాటలు అయితే పరమబోర్. కార్తిక పళని కెమెరా వర్క్ మాత్రం అప్ టు ది మార్క్ ఉంది. తెర మీద చూస్తే ఆ విజువల్స్ ఇంకా అదిరిపోయేదనిపిస్తుంది. అనిల్ క్రిష్ ఎడిటింగ్ కత్తిరకు మరింత పదును పెడితే కాస్త లాగ్ తగ్గేది. కార్తీక్ సుబ్బరాజ్ అండ్ టీం ప్రొడక్షన్ వ్యూల్యూస్ బాగున్నాయి. రియల్ లొకేషన్స్ లో తక్కువ బడ్జెట్ లో లాగేసారు.
undefined
ఫైనల్ థాట్పెంగ్విన్ ..విన్ అవటం కష్టమే, కీర్తి సురేష్ కీర్తికి ఇది నష్టమే
undefined
నిర్మాత: కార్తీక్‌ సుబ్బరాజ్‌, కార్తికేయన్‌ సంతానం, సుధాన్‌ సుందరమ్‌, జయరామ్‌రచన, దర్శకత్వం: ఈశ్వర్‌ కార్తీక్‌బ్యానర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ప్యాషన్‌ స్టూడియోస్‌విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌Rating: 2-- సూర్య ప్రకాష్ జోశ్యుల
undefined
click me!