Siva karthikeyan, sai Pallavi, Amaran
శివ కార్తికేయన్ (Siva Karthikeyan), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటించిన చిత్రం ‘అమరన్’ (Amaran)మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్‌హాసన్ నిర్మించారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమరన్’.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్), ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి) నటించారు. ఈ సినిమా త్వరలో ఓటిటి రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఊహించని ట్విస్ట్ పడేలా ఉంది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ ఆపాలని ఓ స్టూడెంట్ కేసు వేసారు. అసలేం జరిగింది. కేసు ఏమిటనే విషయాలు చూద్దాం.
amaran
‘అమరన్’ (Amaran) సినిమాలో తన ఫోన్ నంబరు వినియోగించడం వల్ల చాలా ఇబ్బంది కలిగిందని పేర్కొంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్ అనే ఇంజనీరింగ్ విద్యార్థి చిత్ర టీమ్ నికి లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. తాజాగా అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ సినిమా ఓటీటీ విడుదలపై బ్యాన్ విధించాలని కోరుతూ దావా వేశాడు. చిత్ర టీమ్ నుంచి తనకు ఇంకా నష్టపరిహారం అందలేదని పేర్కొన్నాడు.
Actor Sivakarthikeyan starrer Amaran
అంతేకాకుండా గతంలో తాను లీగల్ నోటీసులు పంపించినప్పటికీ సినిమా నుంచి తన ఫోన్ నంబర్ ఉన్న సన్నివేశాలు తొలగించలేదని పేర్కొన్నాడు. దానివల్ల తనకు ఫోన్ కాల్స్ నుంచి ఇబ్బంది తొలగలేదని అన్నాడు. ‘అమరన్’లోని ఒక సీన్ లో హీరోయిన్.. హీరోకు తన ఫోన్ నంబర్ ఇస్తుంది. దీని కోసం చిత్ర టీమ్ ఒక నంబర్ ఉపయోగించింది. సినిమా విడుదలయ్యాక.. సాయి పల్లవి ఫోన్ నంబర్ అదేనని భావించిన పలువురు అభిమానులు కాల్స్ చేయడం మొదలుపెట్టారు.
Amaran
సినిమాలో చూపించిన నంబర్ తనదేనని.. వరుస ఫోన్ కాల్స్, సందేశాల వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండా పోయిందని విఘ్నేశన్ పేర్కొన్నాడు. దీనివల్ల తాను కుటుంబసభ్యులతో సరిగా సమయాన్ని గడపలేకపోతున్నానని చెప్పాడు. తన ఫోన్ నంబర్ ఉపయోగించినందుకు చిత్ర టీమ్ వెంటనే రూ.1.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇటీవల టీమ్‌కు లీగల్ నోటీసులు పంపించాడు.
Amaran Movie
ఇక మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్), ఇందు రెబెకా వర్ఘీస్ (సాయిపల్లవి) నటించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. డిసెంబర్ 5 నుంచి ఇది ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కానుంది.
Sivakarthikeyans Amaran
భారీ అంచనాల మధ్య దీపావళి రోజు (అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి రివ్యూలు తెచ్చుకుంది. తమిళంలో సాలిడ్ హిట్ టాక్ నడుస్తోంది. తెలుగు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కూడా ఎ, మల్లిప్లెక్స్ లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. మరీ ముఖ్యంగా ప్రేక్షకులు కంటతడి పెట్టుకునేలా సాయిపల్లవి తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేసిందని అంటున్నారు. దీనికి కూడా రూ.30 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ చెప్తోంది. ఈ సినిమా Netflix లో స్ట్రీమ్ అవనుంది.