వామ్మో కీర్తిసురేష్‌ ధైర్యానికి మొక్కాల్సిందే.. పాన్‌ ఇండియా స్టార్‌నే కాదనుకున్న`మహానటి`

Published : Oct 14, 2022, 03:45 PM ISTUpdated : Oct 14, 2022, 05:57 PM IST

కీర్తిసురేష్‌ కెరీర్‌ అంత ఆశాజనకంగా సాగడం లేదు. ఇటీవల వరుస సినిమాలతో మెప్పించిన ఈ భామ చేతిలో ఒక్క ఆఫరే ఉంది. కానీ లేటెస్ట్ గా ఓ పాన్‌ ఇండియా స్టార్‌ ఆఫర్‌ని తిరస్కరించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది.  

PREV
17
వామ్మో కీర్తిసురేష్‌ ధైర్యానికి మొక్కాల్సిందే.. పాన్‌ ఇండియా స్టార్‌నే కాదనుకున్న`మహానటి`
Keerthy Suresh

కీర్తి సురేష్‌ అంటే `మహానటి` అనే ముద్ర వేసుకుంది.`మహానటి` చిత్రంలో ఆమె అద్భుతమైన నటనకు యావత్ దేశమే ఫిదా అయ్యింది. అందుకే జాతీయ అవార్డు వరించింది. కానీ కీర్తిసురేష్‌ నెక్ట్స్ సినిమాల విషయంలో చేసిన పొరపాట్లు ఆమె కెరీర్‌ని ప్రశ్నార్థకంలో పడేశాయి. 
 

27
keerthy suresh

ప్రస్తుతం కీర్తిసురేష్‌ కేవలం నానితోనే నటిస్తుంది. `నేను లోకల్‌` తర్వాత నానితో ఇప్పుడు `దసరా` చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో నాని పూర్తి డి గ్లామర్‌ రోల్‌ చేస్తున్నారు. సింగరేణి నేపథ్యంలోని కూడిన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తి చేతిలో అఫీషియల్‌గా ఈ ఒక్క సినిమానే ఉంది. 

37

ఏడాది క్రితం కీర్తిసురేష్‌ నాలుగైదు సినిమాలతో బిజీగా ఉంది. కానీ ఇప్పుడు ఆమె చేతిలో ఒకే సినిమా ఉంది. దీనికితోడు ఇప్పుడు ఆమో ఓ పాన్‌ ఇండియా స్టార్‌తో నటించే ఆఫర్‌ని రిజెక్ట్ చేశారట. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఆ పాన్‌ ఇండియా స్టార్‌ ఎవరో కాదు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్. `ఆర్‌ఆర్‌ఆర్`తో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన నటనకు దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయంగానూ ప్రశంసలు దక్కాయి. `ఆస్కార్‌` బరిలోనూ నిలవబోతున్నారు.
 

47

 ఈ నేపథ్యంలో కీర్తి .. తారక్‌తో సినిమా చేసేందుకు నిరాకరించడం హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబినేషన్‌లో `ఎన్టీఆర్‌30` రూపొందాల్సి ఉంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఫైనల్‌కి చేరుకుంది. కాస్టింగ్‌ ఎంపిక జరుగుతుంది. హీరోయిన్‌కి సంబంధించిన చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత, జాన్వీ కపూర్‌, దీపికా పదుకొనె, రష్మిక మందన్నా, కీర్తిసురేష్‌, మాళవిక మోహనన్‌ వంటి కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట అలియాభట్‌ ఓకే అయ్యింది. 
 

57

కానీ ఆమె ప్రెగ్నెన్సీ కారణంతో తప్పుకుంది. ఆ తర్వాత హీరోయిన్‌ కోసం వేట కొనసాగుతూనేఉంది. దీపికాతోపాటు చాలా మంది కథానాయికలు నో చెప్పారట. ఆ జాబితాలో కీర్తిసురేష్‌ కూడా ఉందని లేటెస్ట్ టాక్‌. ఇందులో నటించేందుకు ఆమె అధికారికంగా నో చెప్పిందని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

67

ఓ వైపు ఆమె చేతిలో సినిమాలు లేవు. దీనికితోడు ఎన్టీఆర్‌తో సినిమా అంటే నో చెప్పాలంటే ఆలోచిస్తారు. కానీ కీర్తి ఆల్మోస్ట్ ఫ్రీగానే ఉన్నా నో చెప్పడం ఇప్పుడు మరింత హాట్‌ హాట్‌గా చర్చ జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. 

77

ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో నటించేందుకు చివరికి రష్మిక మందన్నా ఓకే చెప్పిందని సమాచారం. ఇటీవల ఓ సందర్భంలో మీడియా అడిగిన ప్రశ్నకి తాను ఎగ్జైటింగ్‌గా ఉన్నట్టు చెప్పింది. దీంతో తాను నటిస్తున్నాననే విషయాన్ని రష్మిక చెప్పకనే చెప్పిందని అంటున్నారు నెటిజన్లు. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories