పూనమ్ కౌర్ కి పెళ్లయిందా.. వైరల్ అవుతున్న ఫోటో, దానర్థం ఏంటి ?

First Published Oct 14, 2022, 2:53 PM IST

తాజాగా పూనమ్ కౌర్ నెటిజన్లని కన్ఫ్యూజ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు.

సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. 

తాజాగా పూనమ్ కౌర్ నెటిజన్లని కన్ఫ్యూజ్ చేస్తూ మరో పోస్ట్ పెట్టింది. ఇంస్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు తలలు బాదుకుంటున్నారు. నార్త్ లో పెళ్ళైన మహిళలు కార్వా చౌత్ పండగని సెలెబ్రేట్ చేసుకుంటారు. భర్త క్షేమంగా ఉండాలని భార్యలు జరుపుకునే పండుగ ఇది. 

కొంత కాలంగా సోషల్‌ మీడియా వివాదాలకు దూరంగా ఉన్న పూనమ్‌ కౌర్‌ ఇటీవల మళ్లీ స్పీడు పెంచింది. వరుసగా ఇండస్ట్రీలో తనను ఇబ్బంది పెట్టిన వారికి సంబంధించి ట్వీట్లు చేస్తూ సంచలన సృష్టిస్తోంది. తాను ఎవరికీ గురించి చెపుతుందో డైరెక్ట్‌గా చెప్పకపోయినా హింట్‌ ఇస్తూ మీడియాకు కావాల్సినంత మసాలా పంచుతుంది.

కానీ పూనమ్ కౌర్ కూడా ఈ పండుగని సెలెబ్రేట్ చేసుకుంది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనితో అసలు పూనమ్ కౌర్ కి పెళ్లి ఎప్పుడు అయింది అంటూ నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. పూనమ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యిందా లేక త్వరలో పెళ్ళికి రెడీ అవుతోందా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

పూనమ్ మాత్రం చేతిలో జల్లెడ పట్టుకుని దీపాలు కాంతుల్లో ఉన్న అందమైన పిక్ ని షేర్ చేసింది. సెలెబ్రిటీలు కూడా కార్వాచౌత్ సెలెబ్రేషన్స్ లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం. పూనమ్ కౌర్ ఎలాంటి హాట్ టాపిక్ గురించి అయినా వెంటనే సోషల్ మీడియాలో స్పందిస్తుంది. 

పూనమ్కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్ గా పూనమ్ కౌర్ నటించిన చిత్రాలు తక్కువ. సెకండ్ హీరోయిన్ గా, కీలక పాత్రల్లో పూనమ్ నటించింది. కానీ పూనమ్ కౌర్ కేంద్రంగా వివాదాలు మాత్రం చాలానే ఉన్నాయి. దాదాపు కొన్నేళ్లుగా పూనమ్ కౌర్ తన సోషల్ మీడియాలో నర్మగర్భంగా అనే చేసే కామెంట్స్ అభిమానుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాయి.

పూనమ్ కౌర్ కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు.. పాలిటిక్స్ పై కూడా ఇన్ డైరెక్ట్ ట్వీట్స్ వేస్తూ ఉంటుంది. మొత్తంగా పూనమ్ కౌర్ కి సోషల్ మీడియాలో మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. పూనమ్ కౌర్ సినిమాల పరంగా యాక్టివ్ గా లేదు. 

పూనమ్ కౌర్ తెలుగులో గగనం, శౌర్యం, వినాయకుడు, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. కెరీర్ లో చిన్న చిన్న పాత్రలతోనే సరిపెట్టుకుంది. 

click me!