జయం రవిపై భార్య సంచలన ఆరోపణలు

First Published | Sep 11, 2024, 11:48 AM IST

తనకు తెలియకుండా, తన అంగీకారం లేకుండా విడాకులు తీసుకున్నట్లు రవి వెల్లడించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Jayam Ravi, Aarti, separatin


తమళ హీరో  జయం రవి రెండు రోజుల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలసిందే. గత కొన్ని రోజులుగా రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అదే విషయాన్ని ఖరారు చేస్తూ ఆయన పోస్ట్‌ పెట్టారు. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్లు రవి (Jayam Ravi) తెలిపారు.

అయితే ఈ విషయంపై రవి భార్య ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. తనకు తెలియకుండానే విడాకుల ప్రకటన చేశారని ఆరోపించారు. బహిరంగ ప్రకటన చూసి తాను  షాక్ కి గురైనట్లు తెలిపారు. ఈమేరకు సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ విడుదల చేశారు. 2009లో రవి, ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Actor Jayam Ravi Divorce


ఇంతకీ జయం రవి ప్రకటన ఏంటంటే..

‘జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేనెప్పుడు నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తోంది. ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. 
 


Actor Jayam Ravi

 
మాతో పాటు మా కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈవిషయంపై రూమర్స్‌, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను.

మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎప్పటికీ ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నా’ అని జయం రవి పేర్కొన్నారు. 
 

Jayam Ravi Divorce


జయం రవి భార్య స్పందిస్తూ... ‘

నాకు తెలియకుండానే నా అనుమతి తీసుకోకుండానే విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. 18 ఏళ్లుగా మేము కలిసి ఉంటున్నాం. అయినా ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని నా అనుమతి తీసుకోకుండా ప్రకటించడం నన్ను బాధించింది.

కొంతకాలంగా మా మధ్య వచ్చిన విభేదాలను పరిష్కరించుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను. నా భర్తతో నేరుగా మాట్లాడే అవకాశం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా. దురదృష్టవశాత్తూ నాకు ఆ అవకాశం దక్కలేదు  


‘ఈ ప్రకటనతో నేను, నా పిల్లలు షాకయ్యాం. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం. దీనివల్ల మాకు ఏమాత్రం మంచి జరగదు. బాధ కలిగినప్పటికీ నేను గౌరవంగా ఉండాలని భావిస్తున్నా. అందుకే పబ్లిక్‌గా కామెంట్ చేయడం లేదు. అన్యాయంగా నాపై నిందలు వేసి.. నన్ను తప్పుగా చూపిస్తున్న వార్తలు భరించడం కష్టంగా ఉంది.

ఒక తల్లిగా, నా మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ నా పిల్లల శ్రేయస్సే. ఈ వార్త వారిపై ప్రభావాన్ని చూపుతుందనే విషయం నాకు బాధ కలిగిస్తోంది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందని నేను నమ్ముతున్నా. ఇన్ని రోజులుగా మాకు మద్దతు ఇచ్చిన ప్రెస్‌, అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ ప్రేమే మాకు బలం. మా గోప్యతకు ఎలాంటి భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆర్తి (Aarti) పేర్కొన్నారు.
 

actor jayam ravi

2002లో టాలీవుడ్‌లో విడుదలై సూపర్‌ హిట్‌ అయిన ‘జయం’ సినిమాను తమిళ్‌లో రీమేక్‌ చేశారు. అది మంచి విజయం సాధించడంతో అప్పటినుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది. ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమానే హిట్‌ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ అందరినీ అలరిస్తున్నారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు జయం రవి.

Latest Videos

click me!