దీనికి కీర్తిసురేష్ కూడా రియాక్ట్ అవుతూ, తెలుగులో, తమిళంలో చాలా వరకు అంకుల్స్ నే పెళ్లి చేసుకోవాలని, రాధికా ఆప్టే కామెంట్స్ ని సమర్ధించింది. ప్రస్తుతం వీరి కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ అవుతున్నాయి. రాధికా ఆప్టేని ట్రోల్స్ చేస్తున్నారు. ఆమెకి ఇష్టం లేకపోయి ఉంటే ఆ సినిమా ఎందుకు చేశారని అంటున్నారు. అప్పుడు అవకాశం రావడం అదృష్టమని చెప్పారు. ఇప్పుడు అంకుల్స్ తో రొమాన్స్ చేయడం ఇబ్బంది అంటున్నారని, అవకాశాన్ని బట్టి మాటలు మారుస్తుంటారని విమర్శిస్తున్నారు.
రాధికా ఆప్టే తెలుగులో `రక్తచరిత్ర` రెండు భాగాలతోపాటు బాలయ్యతో `లెజెండ్`, `లయన్` చిత్రాలు చేసింది. ఆయనకు భార్యగా కనిపించింది. దీంతో బాలయ్యని ఉద్దేశించే ఆమె ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. గతంలోనూ తెలుగు హీరో అసభ్యంగా తాకాడని, ఇబ్బంది పెట్టాడని చెప్పి కామెంట్స్ చేసింది రాధిక. ఇప్పుడు ఇలా వ్యంగ్యంగా రియాక్ట్ కావడం గమనార్హం.