Superstar Krishna: కృష్ణ మొదటిసారి భయపడ్డది ఎప్పుడో తెలుసా?.. వరుసగా ఫ్లాప్స్, ఇక నా పనైపోయిందా?

Published : Nov 03, 2026, 09:48 AM IST

సూపర్‌ స్టార్‌ కృష్ణ సాహసాలకు కేరాఫ్‌. కానీ ఆయన ఒక్కసారి మాత్రం బాగా భయపడ్డాడట. వరుసగా సినిమాలు పరాజయం చెందుతుంటే ఇక నా పని అయిపోయిందా అనే టెన్షన్‌ పట్టుకుందట.

PREV
13
లైఫ్‌లో మొదటిసారి భయపడ్డ కృష్ణ

సూపర్‌ స్టార్‌ కృష్ణ డేరింగ్ అండ్‌ డ్యాషింగ్‌ హీరోగా పేరుతెచ్చుకున్నారు. ఆయన అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. చిత్ర పరిశ్రమలో కొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. టెక్నీకల్‌గా అన్ని విషయాలను ఇండస్ట్రీకి మొదటిసారి పరిచయం చేసింది ఆయనే. ఇలా సాహసాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఇలాంటి డేరింగ్‌ పర్సన్‌ కెరీర్‌ పరంగా ఒక్కసారి మాత్రం భయపడ్డారట. వరుసగా సినిమాలు పరాజయం చెందుతుంటే ఇక నా పని అయిపోయిందా అని టెన్షన్‌ పడ్డారట. మరి ఏం జరిగింది? ఆయన ఎందుకు భయపడ్డారు అనేది చూస్తే.

23
అల్లూరి సీతారామరాజు దెబ్బకి అన్ని సినిమాలు ఫ్లాప్స్

`అల్లూరి సీతారామరాజు` మూవీ ఎంతటి సంచలనాలు క్రియేట్‌ చేసిందో తెలిసిందే. కానీ ఆ మూవీ షూటింగ్‌ అంత ఈజీగా జరగలేదు. దర్శకుడు మధ్యలోనే చనిపోతే కృష్ణనే సినిమాని పూర్తి చేశారు. అడవిలో షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. చిత్రీకరణ పూర్తయ్యేంత వరకు అందులోనే ఉన్నారు. ఎట్టకేలకు సినిమా పూర్తి చేశారు. ఆ తర్వాత నిర్మాత చక్రపాణికి సినిమా చూపించారు. ఆయన సినిమా చూశాక కృష్ణకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారట. కృష్ణ వెళ్లారు. నీతో ఎంత మంది సినిమాలు చేస్తున్నారని అడిగితే, ఓ ఏడెనిమిది సినిమాలు అవుతున్నాయని చెప్పారట. దీనికి చక్రపాణి స్పందిస్తూ, ఈ సినిమా రిలీజ్‌ తర్వాత వాళ్లంతా అయిపోతారు. అల్లూరి సీతారామరాజుగా నిన్ను చూశాక మిగిలిన పాత్రల్లో చూడలేరు, ఆడియెన్స్ తీసుకోలేరు. సినిమాలన్నీ ఫ్లాప్ అవుతాయని చెప్పాడట.

33
ఇక నా పని అయిపోయిందా అని భయపడ్డ కృష్ణ

ఆ తర్వాత అన్నట్టుగానే `అల్లూరి సీతారామరాజు` మూవీ సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా పరాజయం చెందుతూ వచ్చాయి. ఏ సినిమా చేసినా పోతుంటే టెన్షన్‌ పట్టుకుందట. చాలా భయపడ్డాడట. ఏంటి ఇక నా పని అయిపోయిందా అనే అనుమానం కూడా కలిగిందట. ఆ సమయంలో మొదటిసారి తాను భయపడినట్టు తెలిపారు కృష్ణ. ఈ టైమ్‌లో వరుసగా 13 సినిమాలు ఫ్లాప్‌ కావడంతో బాగా ఇబ్బంది పడ్డాడట. ఆ తర్వాత తానే కూర్చొని కథ రాసుకొని `పాడిపంటలు` అనే సినిమా చేశారు. అది పెద్ద హిట్‌ అయ్యింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌ బాబు సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. అదే సంక్రాంతికి వారికి పోటీగా `పాడిపంటలు` మూవీ రిలీజ్‌ చేశాడు. అది హిట్‌ అయ్యింది. దీంతో ఊపిరిపీల్చుకున్నాడట. ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని చెప్పాడు కృష్ణ. సాక్షికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని పంచుకున్నారు. మొత్తంగానికి డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ అయిన కృష్ణని కూడా లైఫ్‌లో మొదటిసారి భయపడటం గమనార్హం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories