కీర్తి సురేష్ లుంగీ డాన్స్.. ఊరమాస్ స్టెప్పులతో రచ్చ రచ్చ.. ఇంత హంగామా ఎందుకో తెలుసా?

Published : Oct 15, 2022, 02:42 PM IST

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) లుంగీ డాన్స్ తో దుమ్ములేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న యంగ్ బ్యూటీ నెట్టింటా రచ్చరచ్చ చేస్తోంది. అభిమానులకు, నెటిజన్లకు ఐఫీస్ట్ కలిగిస్తోంది.  

PREV
16
కీర్తి సురేష్ లుంగీ డాన్స్.. ఊరమాస్ స్టెప్పులతో రచ్చ రచ్చ.. ఇంత హంగామా ఎందుకో తెలుసా?

టాలీవుడ్ లోకి డీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తి సురేష్. తొలుత క్లాస్ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో పోటీ పెరుగుతుండటంతో కీర్తి రూటు మార్చుకుంది. బిగ్ స్క్రీన్ పైనా ఏకంగా అందాలు ఆరబోస్తోంది.
 

26

చివరిగా సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటించింది. గతంలో తను నటించిన అన్ని చిత్రాల కంటే ఈ మూవీలో ఎక్కువగానే గ్లామర్ ఒళకబోసింది. ఈ చిత్రం నుంచి కీర్తి సరికొత్తగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెట్టింట అందాల విందుతో హల్ చల్ చేస్తోంది.
 

36

తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లుంగీ కట్టి మాస్ట్ బీట్ కు ఊరమాస్ స్టెప్పులేసింది. ‘మహానటి’గా అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చిన కీర్తి.. ఈ రేంజ్ లో అదరగొట్టడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. లుంగీ డాన్స్ కు దుమ్ములేచిపోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. 
 

46

అయితే ప్రస్తుతం కీర్తి సురేష్ నేచురల్ స్టార్ నాని సరసన ‘దసరా’ (Dasara) మూవీలో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ తుది దశలో ఉన్నట్టు  సమాచారం. కాగా, దసరా పండుగా సందర్భంగా చిత్రం నుంచి అదిరిపోయే లోకల్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

56

Dhoom Dhaam Dhosthaan టైటిల్ తో రిలీజ్ అయిన లోకల్ స్ట్రీట్ సాంగ్ ఆడియెన్స్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్ లోకి వస్తోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం భాగంగా మాస్ సాంగ్ కు లుంగీ కట్టి అదిరిపోయే స్టెప్పులతో హంగామా చేస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 
 

66

కీర్తి సురేష్ - నాని జంటగా గతంలో `నేను లోకల్‌` మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు `దసరా` చిత్రంలో నటిస్తున్నారు. గోదావరి మైనింగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories