బ్లాక్ శారీలో కీర్తి సురేష్ మెరుపులు.. చీరకట్టులో అట్రాక్ట్ చేస్తున్న కళావతి.. ఆ ఈవెంట్ లో సందడి

First Published | Jun 10, 2023, 5:30 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh)  ప్రస్తుతం తన తమిళ చిత్రం విడుదల కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈవెంట్ లో బ్లాక్ శారీలో మెరిసింది. ప్రస్తుతం కళావతి పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ, మలయాళం, తెలుగులో వరుసగా చిత్రాలు చేస్తోంది. 

గతేడాది ‘సర్కారు వారి పాట’ చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ‘మహానటి’ తర్వాత కీర్తికి ఈ చిత్రం మంచి సక్సెస్ ను అందించింది. తన నటనతోనూ ఆకట్టుకుంది. ఈ ఏడాది ‘దసరా’తోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


నానికి జోడిగా రెండోసారి నటించిన కీర్తికి ‘దసరా’ రూపంలో మంచి సక్సెస్ అందింది. ఇలా వరుస చిత్రాలతో కీర్తి హిట్లు అందుకుంటూ ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఇతర భాషల చిత్రాలతోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సందర్భంగా కీర్తి సురేష్ - ఉదయానిధి స్టాలిన్ జంటగా నటించిన ‘మామన్నన్’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. నిన్న ఈ చిత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ చెన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ కు కీర్తి చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

ఈవెంట్ కు హాజరైన కీర్తి సురేష్ బ్లాక్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేసింది. టాప్ షోతో మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు చీరకట్టులో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. తన నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 
 

మామన్నన్ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రచార కార్యక్రమాలను యూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సందడి చేస్తోంది. అలాగే కీర్తి తెలుగులో కీర్తి ‘భోళా శంకర్’లోనూ నటిస్తోంది. తమిళంలో మరిన్ని చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!