మూడొచ్చిదంటున్న సమంత... ఆ మూడో ఫోటోలో వ్యక్తి ఎవరంటున్న నెటిజెన్స్!

Published : Jun 10, 2023, 05:04 PM IST

సమంత సోషల్ మీడియా పోస్ట్ ఆసక్తి రేపుతుంది.  ఆమె చిల్ అవుతున్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలపై నెటిజెన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

PREV
16
మూడొచ్చిదంటున్న సమంత... ఆ మూడో ఫోటోలో వ్యక్తి ఎవరంటున్న నెటిజెన్స్!
Samantha

సమంత లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. కొన్ని ఫోటోలు షేర్ చేసిన సమంత మూడ్ అని క్యాప్షన్ ఇచ్చారు. మూడో ఫోటోలో ఒక వ్యక్తితో సమంత ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఎవరంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

26
Samantha

ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ సెర్బియా దేశంలో జరుగుతున్నట్లు సమాచారం. సిటాడెల్ షూటింగ్ సెట్స్ లో సమంత దర్శకద్వయం రాజ్ అండ్ డీకేలలో ఒకరితో సమంత మాట్లాడుతున్నారు. ఆ ఫోటో ఆమె షేర్ చేశారు. సమంత సింగిల్ కావడంతో ఆమె తోడు వెతుక్కున్నారేమో అనే సందేహం జనాలు వ్యక్తపరుస్తున్నారు.

36
Samantha

కాగా సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ కి ది ఫ్యామిలీ మాన్ ఫేమ్ రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ ధావన్-సమంత ప్రధాన పాత్రలు చేస్తున్నారు. సమంత-వరుణ్ మధ్య బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే ప్రచారం జరుగుతుండగా లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది.

46

అలాగే సమంత విజయ్ దేవరకొండకి జంటగా ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఖుషి చిత్రీకరణ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం తర్వాత సమంత లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత మజిలీ చిత్రం చేశారు. అది సూపర్ హిట్ కొట్టింది.

56

అలాగే సమంత ఓ హాలీవుడ్ మూవీకి సైన్ చేశారని సమాచారం. దర్శకుడు ఫిలిప్ జాన్ చెన్నై స్టోరీ టైటిల్  తో రొమాంటిక్ ఎంటర్టైనర్ చేయనున్నారట. వివేక్ కాల్రా హీరోగా నటించనున్న ఈ హాలీవుడ్ మూవీలో చెన్నై అమ్మాయిగా సమంత నటిస్తున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. 

 

66

ఇక శాకుంతలం మూవీతో సమంతకు భారీ షాక్ తగిలింది. సమంత కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా శాకుంతలం నిలిచింది. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు. శాకుంతలం మూవీతో దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 

click me!

Recommended Stories