Keerthy Suresh: పట్టు శారీలో కీర్తిసురేష్‌ రచ్చ.. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు..

Published : Feb 12, 2022, 07:55 PM IST

`మహానటి` హీరోయిన్‌ కీర్తిసురేష్‌.. ట్రెడిషనల్‌గానూ కట్టిపడేస్తుంది. ఆమె చీర అందాల్లో కనువిందు చేస్తుంటుంది. లేటెస్ట్ గా ఈ మహేష్‌ హీరోయిన్‌ని చూసేందుకు అభిమానులు ఎగబడటం విశేషం. దీంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.   

PREV
110
Keerthy Suresh: పట్టు శారీలో కీర్తిసురేష్‌ రచ్చ.. చూసేందుకు ఎగబడ్డ అభిమానులు..

కీర్తిసురేష్‌(Keerthy Suresh) ట్రెడిషనల్‌ లుక్‌లో కనువిందు చేస్తుంటుంది. మోడ్రన్‌ డ్రెస్‌లోనూ అలరించే ఈ భామ చీరలో కనిపిస్తే కుర్రాళ్లకి వచ్చే కిక్కు మామూలు కాదు. అందుకే బయటకు వచ్చిందంటే ఈ బ్యూటీ చీరలో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. తాజాగా ఈ అందాల భామ ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. 

210

కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్‌ మాల్‌ని శనివారం ప్రారంభించింది Keerthy Suresh. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్‌ చేసింది కీర్తిసురేష్‌. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆ షాపింగ్‌ పరిసరాలనీ జనంతో నిడిపోయాయి. 

310

అయితే చీరలో కీర్తిసురేష్‌ని చూసేందుకు ఈ రేంజ్‌లో ఎగబడటం ఆమెకున్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ప్రస్తుతం కీర్తి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. మొత్తంగా చీరలో అభిమానులను కనువిందు చేస్తుంది కీర్తి. 

410

కీర్తిసురేష్‌ ఇప్పుడు సినిమాల పరంగానూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్‌తో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది. కళావతి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

510

తాజాగా ఈ చిత్రం నుంచి విడుదలైన కళావతి పాట ప్రోమో ట్రెండింగ్‌లో ఉంది. అతి తక్కువ సమయంలో భారీ వ్యూస్‌, లైక్స్ పొందిన సాంగ్‌ ప్రోమోగా నిలిచింది. 

610

దీంతోపాటు తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` సినిమా చేస్తుంది కీర్తిసురేష్‌. ఇందులో ఆమె చిరుకి చెల్లిగా కనిపించబోతుండటం విశేషం. గతేడాది రజనీకాంత్‌ నటించిన `అన్నాత్తే` చిత్రంలోనూ చెల్లిగా నటించిన విషయం తెలిసిందే. 

710

మరోవైపు తెలుగులో కీర్తి.. నానితో మరోసారి కలిసి నటిస్తుంది. `నేను లోకల్‌` తర్వాత వీరిద్దరు జోడి కడుతున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని ప్రకటించారు. అలాగే తమిళంలో రెండు చిత్రాలు, మలయాళంలో మరో సినిమా చేస్తుంది కీర్తి సురేష్‌. 

810

అయితే `మహానటి`తో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన కీర్తి ఆ తర్వాత ఆ స్థాయి హిట్‌ పడకపోవడంతో ఆ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యే పరిస్థితి నెలకొంది.పైగా చెల్లి పాత్రలు పోషించడం ఆమె కెరీర్‌ని గాడి తప్పేలా చేశాయి. కష్టాల్లో పడేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్‌తో నటిస్తున్న `సర్కారు వారి పాట` హిట్‌ మీదే కీర్తి భవితవ్యం ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

910

కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్‌ మాల్‌ని శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్‌ చేసింది కీర్తిసురేష్‌. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

1010

కూకట్‌పల్లిలోని ముగ్దా కంచిపట్టు చీరల షాపింగ్‌ మాల్‌ని శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా పట్టుశారీలో మెస్మరైజ్‌ చేసింది కీర్తిసురేష్‌. ఈ సందర్భంగా కీర్తిసురేష్‌ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories