Krithi Shetty: `ఉప్పెన`కి ఏడాది.. మరో పుట్టిన రోజు ఉంటే దాన్నే ఎంచుకుంటా అంటూ బేబమ్మ భావోద్వేగ పోస్ట్

Published : Feb 12, 2022, 06:23 PM IST

కృతి శెట్టి స్టార్‌గా పుట్టి ఏడాది అవుతుంది. `ఉప్పెన` సినిమా ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో కృతి శెట్టి భావోద్వేగభరిత పోస్ట్ ని పంచుకుంది. మరో పుట్టిన రోజంటూ ఉంటే తను మాత్రం ఆ రోజునే ఎంచుకుంటా అంటూ ఎమోషనల్‌ అయ్యింది.   

PREV
19
Krithi Shetty: `ఉప్పెన`కి ఏడాది.. మరో పుట్టిన రోజు ఉంటే దాన్నే ఎంచుకుంటా అంటూ బేబమ్మ భావోద్వేగ పోస్ట్

ప్రస్తుతం గోల్డెన్‌ లెగ్‌గా, మరోవైపు క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న కృతిశెట్టి స్టార్‌గా బోర్న్ అయ్యింది `ఉప్పెన` చిత్రంతో అనే విషయం తెలిసిందే. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, కృతి హీరోయిన్‌గా ఈ చిత్రంతోనే పరిచయం కాగా, బుచ్చిబాబు దర్శకుడిగా ఇంట్రడ్యూస్‌ అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. కేవలం ఇరవై కోట్లతో రూపొంది, ఏకంగా వంద కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ వర్గాలను, నిర్మాతలను, ట్రేడ్‌ వర్గాలను, చివరికి ఆడియెన్స్ ని సైతం షాక్‌కి గురి చేసింది. 

29

ఈ చిత్రం విడుదలై నేటికి ఏడాది పూర్తయ్యింది. ఈ చిత్రం ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఫిబ్రవరి 12(2021)న విడుదలైన విషయం తెలిసిందే. పాటలు విడుదలకు ముందే హిట్‌ కావడం, శ్రోతలను హంట్‌ చేయడంతో సినిమాపై బజ్‌ నెలకొంది. కానీ పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కరోనా కష్ట సమయాన్ని బ్రేక్‌ చేసింది. ఆడియెన్స్ ని థియేటర్‌కి రప్పించింది. ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది. ఇందులో బేబమ్మగా కృతి శెట్టి చేసిన మ్యాజిక్‌కి కుర్రకారు ఫిదా అయిపోయారు. ఆమె ప్రేమలో పడిపోయారు. వైష్ణవ్‌ తేజ్‌, ఫాదర్‌గా చేసిన విజయ్‌ సేతుపతి నటనలు సైతం సినిమాకి హైలైట్‌గా నిలిచాయి. 

39

నేటితో `ఉప్పెన` సినిమా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కృతి శెట్టి సోషల్‌ మీడియా ద్వారా స్పందించింది. ఓ ఎమోషనల్‌ పోస్ట్ ని పంచుకుంది. చిత్రంలోని ఫోటోలను పంచుకుంటూ కృతి నెటిజన్ల హృదయాలను కదిలించింది. 
 

49

`ఉప్పెన`కి ఏడాది. మనకు రెండు పుట్టిన రోజులు ఉంటే. ఒకటి మనం పుట్టిన రోజు, మరొకటి మనం ఎంచుకునేది. అందుకు నేను ఈరోజుని ఎంచుకుంటాను. ఎందుకంటే నిజానికి ఈ రోజుతో నా జీవితం ప్రారంభమైంది. ఏడాది పాటు బేషరతుగా ప్రేమించబడి, ఏడాది పాటు కృతజ్ఞతతో, సంతోషంగా ఉండేలా చేసింది. ఏడాది పాటు చిత్ర పరిశ్రమలో ఉన్నాను. ఇండస్ట్రీ నన్ను ఆప్యాయంగా స్వీకరించింది. 

59

ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే నేను ఇష్టపడే పని చేస్తున్నా. మీ పాజిటివ్‌ రియాక్షన్‌ నన్ను ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రయాణాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చిన నా ప్రియమైన అభిమానుల పేజీలకు ధన్యవాదాలు. మీ ఎడిటింగ్‌లతో నన్ను కన్నీళ్లు పెట్టించారు. మిమ్మల్ని ఇలానే అలరిస్తానని, కష్టపడి పనిచేస్తానని వాగ్దానం చేస్తున్నా. అందరికి థ్యాంక్స్` అని పేర్కొంది కృతి. దీనికి స్పందించిన అభిమానులు ఆమెకి శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు చెబుతున్నారు. 

69

ఇక `ఉప్పెన` చిత్రంలో బేబమ్మగా కృతి శెట్టి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇన్నోసెంట్‌గా కనిపిస్తూ, సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. మరోవైపు క్యూట్‌ అండ్‌ ఫ్రెష్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసింది. కుర్రాళ్లకి డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. కృతి శెట్టిని ఫస్ట్ టైమ్‌ పోస్టర్‌పై చూసే లక్షల మంది ఆమెకి ఫిదా అయిపోయారంటే అతిశయోక్తి కాదు. 
 

79

తొలి విజయంతోనే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది కృతి. చిరంజీవి లాంటి వారే ఆమెని బోర్న్ స్టార్‌ అని పిలవడం విశేషం. మొదటి చిత్రంతో టాలీవుడ్‌ ఇండస్ట్రీని ఆకర్షించిన ఈ బ్యూటీ వెంట దర్శక,నిర్మాతలు క్యూ కట్టడం విశేషం. దీంతో వరుసగా సినిమా ఆఫర్లని దక్కించుకుంటూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది కృతి. 
 

89

ఆ తర్వాత `శ్యామ్‌ సింగరాయ్‌`, `బంగార్రాజు` చిత్రాల్లో మెరిసింది. ఈ రెండు చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఇప్పుడు రామ్‌తో `ది వారియర్‌` చిత్రంలో, అలాగే సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, నితిన్‌తో `మాచర్ల నియోజకవర్గం` వంటి చిత్రాల్లో నటిస్తుంది. దీంతోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లు ఆమె ఖాతాలో ఉండటం విశేషం. 
 

99

ఓ వైపు సినిమాల్లో అద్భుతమైన నటనతో, క్యూట్‌ అందాలతో కనువిందు చేసే కృతి శెట్టి సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గానే ఉంటుంది. తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. నేటి ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. రెండు రకాలుగా అలరిస్తుందీ క్యూట్‌ అందాల భామ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories