Keerthy Suresh Queen Look: చూడ్డానికి మహారాణిలా ఉన్నా హాట్‌నెస్‌ మాత్రం తగ్గలేదు.. కీర్తిని ఇలా చూస్తే ఇక అంతే

First Published Jan 24, 2022, 5:43 PM IST

కీర్తిసురేష్‌ సమయానుసారంగా  గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతుంది. అందమంటే స్కిన్‌ షో మాత్రమే కాదు, ట్రెండీగానూ మరింత గ్లామరస్‌గా కనిపించవచ్చని నిరూపిస్తుంది కీర్తిసురేష్‌. ఆమె లేటెస్ట్ పిక్స్ నెటిజన్లకి మతిపోగొడుతున్నాయి. 

`మహానటి` ఫేమ్‌ కీర్తిసురేష్‌.. మహారాణిలా మారిపోయింది. భారీ డిజైనింగ్‌ వేర్‌లో రాజహంసలా ముస్తాబైంది. మహారాణి గెటప్‌లో ఆమె ఫోటోలకు పోజులివ్వగా, వాటిని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది కీర్తి. అద్యంతం అద్భుతంగా ఉన్న కీర్తిసురేష్‌ లుక్‌ కనువిందు చేస్తుంది. ఇలా ఎప్పుడూ కీర్తిని చూసి ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతగా మెస్మరైజ్‌ చేస్తుంది. చూపులను హంట్‌ చేస్తుంది. 

కీర్తిసురేష్‌.. ఇంతటి ట్రెండీ వేర్‌లో ఉన్నా.. ఆమెలోని హాట్‌ నెస్‌ మాత్రం రెట్టింపయ్యిందని చెప్పొచ్చు. దీంతో నెటిజన్లు కీర్తిని ఎగబడి చూస్తున్నారు. ఈ పోస్ట్ చేసి రోజు గడవక ముందే ఐదు లక్షల మంది ఈ అమ్మడిని చూడటం విశేషం. అయితే `జోస్‌అలుక్కర్‌` నగల బ్రాండ్‌ ప్రచారంలో భాగంగా కీర్తి ఇలా ట్రెండీగా ముస్తాబై హోయలు పోయింది. కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌నిచ్చింది. 

కీర్తి.. సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమాల అప్‌డేట్లు పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 11 మిలియన్స్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. దీంతో సినిమాల పరంగానే కాదు, కమర్షియల్‌ యాడ్స్ పరంగానూ కీర్తికి మంచి డిమాండే ఉంది. ఈ బ్యూటీ ఇన్‌స్టాలో ఒక్క పోస్ట్ పెడితే కోటి పదిహేను లక్షల మంది వీక్షిస్తారు. అందుకే కీర్తి చాలా డిమాండెట్‌ సెలబ్రిటీ. 

మరోవైపు సినిమాల పరంగానూ ఫుల్‌ బిజీగా ఉంది కీర్తిసురేష్‌. కేవలం హీరోయిన్‌ పాత్రలకే పరిమితం కాకుండా కీ రోల్స్ కూడా చేస్తుంది. ఇటీవల ఆమె రజనీకాంత్‌ `అన్నాత్తే`(పెద్దన్న) చిత్రంలో సిస్టర్‌ రోల్‌ చేసింది. మరోవైపు ఇప్పుడు చిరంజీవి హీరోగా రూపొందుతున్న `భోళాశంకర్‌`లో చిరుకి సిస్టర్‌ రోల్‌ చేస్తుంది కీర్తి. 

దీంతో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె నటించిన `గుడ్‌లక్‌ సఖీ` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. ఇది ఈ నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం కావడం విశేషం. తాజాగా సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటుంది. నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు.

వీటితోపాటు మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న `సర్కారు వారి పాట` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది కీర్తిసురేష్‌. మరోవైపు నాని హీరోగా రూపొందుతున్న `దసరా` చిత్రంలోనూ తనేహీరోయిన్‌. అలాగే తమిళంలో `సాని కాయిదమ్‌`, మలయాళంలో `వాషి` చిత్రాలు చేస్తుంది కీర్తిసురేష్‌. 

click me!