Keerthy Suresh: కీర్తి సురేష్ కు తండ్రిగా, ప్రియుడిగా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

Published : Feb 02, 2025, 05:08 PM IST

Keerthy Suresh played  daughter and lover Roles  : ఒకే ఒక్క హీరోకు కూతురి పాత్రలో నటించిన కీర్తి సురేష్.. ఆతరువాత లవర్ గా కూడా నటించింది. ఇంతకీ ఎవరా స్టార్ హీరో..? ఏంటా సినిమాలు..? 

PREV
16
Keerthy Suresh: కీర్తి సురేష్ కు తండ్రిగా, ప్రియుడిగా నటించిన  స్టార్ హీరో ఎవరో తెలుసా?
keerthy suresh

రీసెంట్ గా పెళ్లిచేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. తన చిన్నానటి స్నేహితుడు ఆటోనీకి లైఫ్ పార్ట్నర్ గా మారిపోయింది.  హీరోయిన్ గా అన్ని రకాల పాత్రలను ట్రై చేసిన ఈ బ్యూటీ.. తెలుగు,తమిళ, మలయాళ పరిశ్రమలో హీరోయిన్ గా మంచి పేరును తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టింది కీర్తి.

Also Read: 4 నెలల్లో 3 హిట్లు, 850 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టిన లక్కీ హీరోయిన్ ఎవరోొ తెలుసా..?

26

 కాని ఆ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో మాత్రం మంచి మంచి పాత్రలు చేసింది బ్యూటీ. నేచురల్ స్టార్ నానితో, రామ్ పోతినేనితో కీర్తి సురేష్ చేసిన సినిమాలు ప్రేక్షకుల మనసులను హత్తుకున్నాయని చెప్పవచ్చు. ఇక కీర్తి సురేష్ తన తోటి వయసు ఉన్న యంగ్ హీరోస్ తో ఎక్కువ సినిమాలు నటించింది. అంతే కాదు సీనియర్ స్టార్ హీరోల సరసన కూడా మెరిసింది. 
 

Also Read: పాకిస్థాన్ లో అల్లు అర్జున్ కు ఇంత క్రేజ్ ఉందా..?

36

తనతో ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉన్న మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా ఆడిపాడింది బ్యూటీ. అయితే తనకంటే 30 ఏళ్ళకు పైగా పెద్ద అయిన చిరంజీవి, రజినీకాంత్ ల సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. కాని వారికి చెల్లెలుగా నటించింది కీర్తి సురేష్. చిరంజీవితో భోళా శంకర్ లో కనిపించింది కీర్తి. ఈసినిమా డిజాస్టర్ అయ్యింది. 
 

Also Read: రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ కు నచ్చని రెండు సినిమాలు ఏవో తెలుసా..?

46

ఇక కీర్తి సురేష్ ఓ సీనియర్ హీరోకు కూతురిగా.. ఆతరువాత ప్రియురాలిగా నటించింది అని మీకు తెలుసా? చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూతురిగా.. కాస్త పెరిగిన తరువాత ఆయనకే ప్రియురాలిగా నటించిందని తెలిసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. ? మలయాళ స్టార్ హీరో దిలీప్. 
 

Also Read: బాలయ్య ఎక్కడికి వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే, అందులో ఏముంటాయో తెలుసా?

56

 2002లో దిలీప్ హీరోగా వచ్చిన  కుబేరన్ సినిమాలో అతడు ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటాడు. ఆ ముగ్గుురిలో  కీర్తి సురేష్ కూడా ఉన్నారు.  ఆ తర్వాత కొన్నాళ్లకు 2014లో వచ్చిన రింగ్ మాస్టర్ సినిమాలో దిలీప్ ప్రేయసిగా కీర్తి సురేష్  నటించింది. అయితే ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి దిలీప్ ను చూస్తూ పెరిగిన కీర్తి సురేష్.. అతన్ని అంకుల్ అనేదట. 

 

66

అయితే హీరోయిన్ గా మారి.. బిజీగా ఉన్న టైమ్ లో.. ఆ హీరో కీర్తిని పిలిచి.. ఇదివరకు అంకుల్ అనేదానివి కదా.. ఇప్పుడు అలా పిలవకు. కావాలంటే అన్నయ్య అని పిలువు అని అన్నారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories