
మర్డర్ మిస్టరీ, క్రైమ్ ఇన్వేస్టిగేషన్, యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐడెంటిటీ. జనవరిలో మలయాళం, తెలుగులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు.
అయితే త్రిష, వినయ్ రాయ్, టివినో థామస్ వంటి స్టార్స్ ఉండటంతో ఓటిటిలో ఈ సినిమాకు మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. లైంగిక వేధింపులు..రివేంజ్, .. సైకలాజికల్ ఎలిమెంట్స్ వంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో ముడిపడి ఉన్న ఈ సినిమాలో అసలు కథేంటి, మన ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుంది
కథ
ఓ టీవీ ఛానెల్ లో ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ గా చేస్తున్న అలీషా (త్రిష) ఓ కేసుకు సంబంధించిన పరిశోధనలో భాగంగా ఆమె ఒక పాడుబడిన ఫ్యాక్టరీకి వెళ్తుంది. అక్కడ అనుకోకుండా ఓ మర్డర్ చూస్తుంది. దాన్ని మొత్తం షూట్ చేసి తిరిగి వస్తూండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ తర్వాత ఆమె ఫేస్ బ్లైండ్ నెస్ అనే సమస్య మొదలవుతుంది. దాంతో ఆ హంతకుడు ఎవరనేది ఆమె చెప్పలేకపోతుంది. అయితే ఆ హత్యకు ఏకైక సాక్షి అయిన ఆమె ద్వారా అసలు తెలుసుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ అలెన్ జాకబ్ (వినయ్ రాయ్) ప్రయత్నిస్తూ ఉంటాడు. అలీషాను ఒక సీక్రెట్ ప్లేస్ లో ఉంచి పేరు మార్చి రక్షిస్తూ ఉంటాడు.
అంతేకాకుండా హరన్ శంకర్ (టొవినో థామస్) అనే స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా అలీషాతో హంతకుడి పోలికలు చెప్పిస్తూ స్కెచ్ గీయిస్తాడు. అలీషా చెప్పినట్టు బొమ్మ గీసిన హరన్, తన పోలికలతో ఆ బొమ్మ ఉండటం చూసి షాక్ అవుతాడు. అక్కడ నుంచి ఏమైంది. అసలు హంతకుడు ఎవరు..హరన్ శంకర్ కు ఈ కేసుకు సంభందం ఏమిటి, చివరకు త్రిష ఆ ఫేస్ బ్లైండ్ నెస్ సమస్య నుంచి బయిట పడగలిగిందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
కొన్ని ప్రత్యేకమైన ప్రొఫిషన్ లు, మెడికల్ సిట్యువేషన్స్ గురించి తెరపై చెప్పాల్సివచ్చినప్పుడు మినిట్ టు మినిట్ డిటేల్స్ ఇస్తూంటారు. లేకపోతే ఆ విషయాలపై అవగాహన లేని ప్రేక్షకులు ఇబ్బంది పడతారని. ఆ విషయంలో డైరక్టర్స్ ద్వయం చేసిన రీసెర్చ్,మైన్యూర్ డిటేల్స్ ని ప్రజెంట్ చేసిన తీరు మెచ్చుకోదగినదే. ఎందుకంటే ఫేషియల్ బ్లైండ్‌నెస్ నుండి స్కెచ్ ఆర్టిస్ట్ సైకాలజీ వరకు సామాన్య ప్రేక్షకుడుకి పరిచయం తక్కువే. అయితే ఇక్కడ సమస్య కూడా వచ్చింది. మరీ వివరణ ఎక్కవయ్యే సరికి బోర్ కొట్టేసింది. సినిమాలో ఎక్కడో, ఒక ట్విస్ట్‌ని ఓపెన్ చేయటం కోసం దాని చుట్టూ విపరీతమైన డ్రామా ఎలిమెంట్స్ క్రియేట్ చేసి కన్ఫూజ్ చేయటం అనవసరం అనిపించింది. థ్రిల్లర్ నేరేషన్ కోసం అలా చేసామని డైరక్టర్స్ వాదించవచ్చేమో కానీ ఇలాంటి స్పూన్ ఫీడింగ్ స్క్కీన్ ప్లే ఎక్కువ శాతం విసిగించేదే. దానికి తోడు స్లో నేరేషన్ ఒకటి
ఓ సింపుల్ రివేంజ్ ఎలిమెంట్ తీసుకుని కానీ దాన్ని భారీగా స్క్రీన్ ప్లే చేయటంతో సినిమా ఓ స్దాయికి వచ్చేసరికి అలిసిపోతాము. సినిమాలో కొంత అర్దమవుతున్నట్లే ఉంటుంది అర్దంకాదు. డైరక్టర్ ఉద్దేస్యం కూడా అదే కావచ్చు. ఒక్కో ముడి విప్పే విధానం కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. చివర్లో అసలేం జరిగిందో ఎక్సప్లై్ చేసేటప్పుడు మొత్తం ఎనర్జీ లాగేసుకుంటారు. దాంతో ఈ సంక్లిష్టత ఎక్కువ అవటంతో సినిమాలో ఏదైతే హైలెట్ కావాలో ఆ వావ్ ఫ్యాక్టర్ మిస్సైంది. లీనియర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీరో ..పూర్తిగా విలన్ కథలో ఓ సబ్ ప్లాట్ లా కనపడతాడు కానీ హీరోగా అనిపించడు. కనిపించడు.
టెక్నికల్ గా చూస్తే...
సినిమాకు స్క్రీన్ ప్లే లో అతి గా వెళ్లటమే ఇబ్బంది పెట్టింది. ఫస్టాఫ్‌లో సెటప్ సీన్స్ బాగా డీల్ చేశాడు. సెకండాఫ్ సోసోగా ఉంది. క్వాలిటీ మేకింగ్ కనిపించింది. పాటలకు స్కోప్ లేదు. అనవసరంగా వాటిని ఇరికించే ప్రయత్నం కూడా చేయలేదు. జేక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అఖిల్ జార్జ్ కెమెరా వర్క్ అలరిస్తాయి. యాక్షన్ బ్లాక్స్ ని షార్ప్ గా పిక్చరైజ్ చేసారు.
నటీనటుల్లో టోవినో థామస్ .. చాలా బాగా చేసారు. ముఖ్యంగా అతని బాడీ లాంగ్వేజ్ పాత్రకు తగినట్లు స్టిఫ్ గా ఓ రకమైన అబ్సెషన్ ని నింపుకున్నట్లు కనపడుతుంది. మరో ప్రక్క స్టైలిష్ కూడా ఉంది. వినయ్ రాయ్ ఈ సినిమాకి హైలైట్ . త్రిష సినిమా మొత్తం కనిపిస్తుంది. కానీ కథలో పెద్దగా కీలకమైన మార్పులు తీసుకురాదు.
చూడచ్చా
తెలుగులో “ప్రసన్న వదనం” చూసిన వారికి ఈ పాయింట్ కాస్త డైజెస్ట్ అవుతుంది. అలాగే సినిమాని కాన్సర్టేషన్ గా చూడకపోతే డిస్కనెక్ట్ చేస్తుంది
నటీనటులు: టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్, మందిరా బేడి, అర్చన కవి, అజు వర్గీస్, షమ్మీ తిలకన్, అర్జున్ రాధాకృష్ణన్ తదితరులు
దర్శకత్వం: అఖిల్ పాల్, అనాస్ ఖాన్
నిర్మాతలు: రాజ్ మల్లియత్, రాయ్ సీజే, కోచుమోన్
సినిమాటోగ్రఫీ: అఖిల్ జార్జ్
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : జీ5