అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లి? రూమర్లపై స్పందించిన తండ్రి.. ఏమన్నారంటే.!

First Published | Sep 17, 2023, 3:37 PM IST

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ మరోసారి మహానటి మ్యారేజ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై ఆమె తండ్రి స్పందించారు. వాస్తవం ఇదంటూ క్లారిటీ ఇచ్చారు. 
 

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిగా తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విషయం తెలిసిందే. తన నటనతో ‘మహానటి’ ద్వారా నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 

ఇదిలా ఉంటే.. కీర్తి సురేష్ పెళ్లి అప్పుడు.. ఇప్పుడు అంటూ కొన్నాళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వరుడు వ్యాపారవేత్త అంటూ, తన స్నేహితుడే అంటూ రూమర్లు నెట్టింట షికార్లు చేశాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు కీర్తి సురేష్, ఆమె కుటంబీకులు. 


ఇక తాజాగా స్టార్ మూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర (Anirudh Ravichandra)తో ఈ ముద్దుగుమ్మ పెళ్లి అంటూ న్యూస్ వైరల్ గా మారింది. ఈ వార్తలపై ఆమె తండ్రి స్పందించడం ఆసక్తికరంగా మారింది. కీర్తి మ్యారేజ్, డేటింగ్ రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. 

ఆయన చెప్పిన ప్రకారం.. కీర్తి సురేష్ అనిరుధ్ పెళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఎవరో కావాలని సృష్టించినవే. కీర్తి పెళ్లిపై ఇలాంటి వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. చాలా ఉన్నాయి. కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఏమాత్రం నిజం లేదు.’ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ రూమర్లను ఖండించింది. గతంలో తండ్రి మేనక కూడా కొట్టిపారేసింది.

అయితే రెమో, గ్యాంగ్, అజ్థాతవాసి వంటి చిత్రాలకు కీర్తితో పాటు అనిరుధ్ కూడా కలిసి పనిచేశారు. పైగా వీరిద్దరూ క్లోజ్ గా దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దానికి తోడు రీసెంట్ గా ‘జవాన్’ సాంగ్ కు కీర్తి డాన్స్ చేయడంతో మళ్లీ రూమర్లు వచ్చినట్టు కనిపిస్తోంది. ఏదేమైనా కీర్తి ఫాదర్ క్లారిటీ ఇవ్వడంతో పుకార్లకు అడ్డుకట్ట పడింది. 
 

ఇక కీర్తి నిర్మాత జీ సురేష్ కుమార్, నటి మేనకల కూతురు. 1992 అక్టోబర్ 17న ఈ దంపతులకు జన్మించింది. బాలనటిగానే కెరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఉత్తమ నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం కొనసాగిస్తోంది. వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. చివరిగా ‘దసరా’, ‘భోళా శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది. 
 

Latest Videos

click me!