ఎర్ర చీరలో ఘాటు మిర్చిలా సదా.. సైడ్ యాంగిల్లో నడుము అందాలు అదుర్స్.. బ్యూటీఫుల్ స్టిల్స్

First Published | Sep 17, 2023, 2:23 PM IST

సీనియర్ నటి సదా ప్రస్తుతం బుల్లితెరపైనే సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ అందంగా మెరుస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. 
 

‘జయం’ బ్యూటీ సదా తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లోనే నటించినా గుర్తుండిపోయేలా చేసింది. మరోవైపు తన అందంతోనూ ఆకట్టుకుంది. సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.
 

కొన్నాళ్ల పాటు తమిళం, తెలుగు చిత్రాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ ఐదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. అందుకు కారణంగా అంతకముందు సదా చేసిన సినిమాల ఫలితాలనే తెలుస్తోంది. ఆ చిత్రాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆఫర్లు తగ్గుతూ వచ్చాయి. 
 


వెండితెరకు దూరమైనప్పటికీ సదా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తూనే ఉంది. వరుస టీవీ షోలతో ఆకట్టుకుంటూనే వస్తోంది. స్మాల్ స్క్రీన్ పై మెరుస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ షోలతో కట్టిపడేస్తోంది. 
 

ఇప్పటికే ‘ఢీ’, ‘బీబీ జోడీ’, ‘నీతోనే డాన్స్’  వంటి షోలతో టీవీ ఆడియెన్స్ నూ అలరిస్తూనే వస్తోంది. రీసెంట్ గానే స్టార్ మాలో 14 వారాల పాటు ప్రసారమైన Neethone Dance డాన్స్ షో మొదటి సీజన్ పూర్తైంది. ఆట సందీప్, జ్యోతి విన్నర్ గా నిలిచారు. 
 

ఈ షో కోసం సదా చాలా అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేసింది. గ్లామరస్ గా బుల్లితెరపై మెరిసి ఆకట్టుకుంది. తాజాగా గతంలోని ఓ బ్యూటీఫుల్ ఫొటోషూట్ ను అభిమానులతో పంచుకుంది. ఆ పిక్స్ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. 
 

ఎర్ర చీరలో సదా రెడ్ మిర్చీలా మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, చీరకట్టులో అందాల విందు చేసింది. సైడ్ యాంగిల్లో నడుము చూపిస్తూ.. కవ్వించేలా ఫోజులిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. చూపుతిప్పుకోకుండా చేసింది.

మత్తెక్కించే చూపులతో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. సదా కిర్రాక్ ఫోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ ఫిదా అవుతున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ ఈ ముద్దుగుమ్మను ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇక సదా చివరిగా ‘అహింస’ అనే చిత్రంలో నటించింది. తేజ దర్శకత్వం వహించారు. అభిరామ్ హీరోగా అలరించారు. అంతకు ముందు ‘హాలో వరల్డ్ ’ సిరీస్ లోనూ ప్రధాన పాత్ర పోషించింది సదా. దీంతో లీడ్ రోల్ లో నటించేదెప్పుడంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Latest Videos

click me!