టాలీవుడ్(Tollywood)లో మలయాళ ముద్దుగుమ్మల(Malayalam Heroines) హవా మామూలు కాదు. అద్బుతమైన నటనతో మెస్మరైజ్ చేశారు. సునామీలా దూసుకొచ్చి అంతే వేగంగా కనుమరుగు అవుతుంటారు. ఒకరు ఇద్దరు తప్పితే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుని, టాలీవుడ్‌లో సెటిల్ అయిన వాళ్లు చాలా తక్కువ. ఇప్పటి తరం కథానాయికలు సైతం ఆదిలో మెరుస్తూ, అంతలోనే డౌన్‌ఫాల్ అవుతున్నారు.
నిత్యా మీనన్(Nithya Menon), అను ఇమ్మాన్యుయెల్(Anu Emmanuel), నివేదా థామస్(Nivetha Thomas), కీర్తిసురేష్(Keerthy Suresh), అనుపమా పరమేశ్వరన్ వంటి మలయాళ ముద్దుగుమ్మల కెరీర్ చాలా కాలంగా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు సినిమాల వరకు ఫర్వాలేదు. తర్వాత వరుసగా పరాజయాలు పడటంతో సైలెంట్ అయిపోతున్నారు. ఇటీవల కాలంలో కీర్తిసురేష్ స్టార్ హీరోయిన్‌గా నిలిచింది. కానీ ఇప్పుడు ఆమె వరుస పరాజయాల్లో ఉంది.
`మహానటి`తో స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తిసురేష్. ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని సొంతం చేసుకుంది. ఇటీవల కాలంలో ఈ రేంజ్ సక్సెస్ అందుకున్న మలయాళ భామ లేదంటే అతిశయోక్తి లేదు. దీంతో వరుసగా కమర్షియల్ చిత్రాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ `మహానటి` తర్వాత కీర్తికి తెలుగులో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ కూడా సక్సెస్ ఆమడ దూరంలో ఉండిపోయింది.
నిత్యా మీనన్ మొదట్లో బాగానే మెరిసినా, ఆమె కూడా స్టార్ హీరోల సరసన కమర్షియల్ చిత్రాలు చేసింది తక్కువ. సెకండ్ హీరోయిన్‌గా పరిమితమయ్యే పరిస్థితి. అను ఇమ్మాన్యుయెల్ `మజ్ను` సక్సెస్ తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ తగల్లేదు. కేథరిన్ థ్రెస్సా సైతం స్టార్ ఇమేజ్‌కి నోచుకోలేకపోయింది. పూర్ణ బోల్డ్ బ్యూటీగా మారిపోయింది. అమలా పాల్ ఒకటి అర సినిమాల్లో మెరిసి టాలీవుడ్‌కి దూరమైంది. భావన, ఆసిన్, ప్రియమణి వంటి కథానాయికలు సైతం సేమ్. వాళ్లు తెలుగులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.
Anupama Parameswaran
కానీ ఆ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తుంది అనుపమా పరమేశ్వర్(Anupama Parameswaran). మొన్నటి వరకు అనుపమా పరమేశ్వరన్ కెరీర్ కూడా తెలుగులో అయిపోయిందనుకున్నారు. చాలా వార్తలు వినిపించాయి. సోషల్ మీడియాలో అనేక పోస్టులు కూడా వచ్చాయి. కానీ దాన్ని ఒక్క సినిమా బ్రేక్ చేసింది. `కార్తికేయ 2` అనుపమాకి ఊహించిన బూస్ట్ ఇచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విశేషం.
Anupama Parameswaran
దీంతో ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతుంది అనుపమా. ఆమె ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. అదే సమయంలో కెరీర్ పరంగా పెద్ద బూస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఓ రకంగా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. మరో రెండుమూడేళ్ల వరకు అనుపమాకి తిరుగులేదని చెప్పొచ్చు.
`ప్రేమమ్` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్. ముగ్గురు హీరోయిన్లలో టీనేజ్ బ్యూటీ అదరగొట్టింది. దీంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకుంది. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం.
దీని తర్వాత వరుస పరాజయాలు ఆమెని వెంటాడాయి. `ఉన్నది ఒక్కటే జిందగీ`, `కృష్ణార్జున యుద్ధం`, `తేజ్‌ః ఐ లవ్ యూ`, `హలో గురు ప్రేమ కోసమే` చిత్రాల్లో నటించగా, అవన్నీ పరాజయం చెందాయి. దీంతో అనుపమా పరిస్థితి కూడా అయిపోయిందనే వార్తలు స్టార్ట్ అయ్యాయి. ఇతర మలయాళ భామలు మాదిరిగానే అనుపమా మిగిలిపోతుందన్నారు.
కానీ `రాక్షసుడు` చిత్రం కాస్త హోప్ ఇచ్చింది. కానీ అవకాశాలు లేవు. ఆ సమయంలోనే `18పేజెస్`, `కార్తికేయ 2` వంటి ఆఫర్లు బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. అలాగే `రౌడీ బాయ్స్` వంటి యూత్‌ఫుల్ మూవీలోనూ మెరిసింది. ఇందులో బోల్డ్ రోల్ చేసి షాకిచ్చింది. తాను మారాననే సిగ్నల్స్ ఇచ్చింది. ఇప్పుడు `కార్తికేయ2`తో సంచలన విజయం దక్కించుకుని మళ్లీ ప్రామిసింగ్ హీరోయిన్ అయిపోయింది.
ప్రస్తుతం అనుపమా పరమేశ్వరన్ చేతిలో `18 పేజెస్`తోపాటు `బట్టర్ ఫ్లై` అలాగే రెజీనాతో చేస్తున్న బైలింగ్వల్ మూవీ ఉంది. మరికొన్ని చర్చల దశలో ఉన్నట్టు తెలుస్తుంది. నెమ్మదిగా బిజీ అవుతుంది అనుపమా. అయితే ట్రెండ్‌కి తగ్గట్టుగా అనుపమా కూడా మారిపోతుంది. మలయాళ హీరోయిన్లంటే గ్లామర్ షోకి దూరమనే ట్యాగ్ పడిపోయింది. కానీ అనుపమా దాన్ని బ్రేక్ చేసింది. అందాల ఆరబోతకి కూడా తాను సిద్దమే అనే సిగ్నల్స్ ఇస్తుంది.
అందుకు తగ్గట్టుగా వరుసగా హాట్ ఫోటోలను పంచుకుంటుంది. గ్లామర్ విందు చేస్తూ నెటిజన్లకి మైండ్ బ్లాక్ చేస్తుంది. బోల్డ్ సీన్లలోనూ నటిస్తూ కమర్షియల్ హీరోయిన్ ఫ్లేవర్‌ని తీసుకొస్తుంది. మలయాళ భామల సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తూ కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. నయా ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. మరి ఈ భామ సందడి మున్ముందు ఎలా ఉంటుందో చూడాలి.