`కల్కి 2898 ఎడి` లో కీర్తి సురేష్.. చిన్న ఇంట్రస్టింగ్ ట్విస్ట్

Published : May 18, 2024, 02:49 PM IST

బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పొందుతున్న కల్కి 2898 AD సినిమాలో ఆమె ఒక క్యారెక్టర్ కోసం వర్క్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.  

PREV
19
`కల్కి 2898 ఎడి` లో  కీర్తి సురేష్.. చిన్న ఇంట్రస్టింగ్  ట్విస్ట్
Keerthy Suresh

  మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందిన  మళయాళి బ్యూటీ కీర్తి సురేష్(Keerthy Suresh)​. ఆమె వరుస విజయాలతో నెక్ట్స్  లెవిల్ అన్నట్లుగా ఫామ్​ లో ఉంటూ ఎప్పుడూ ఏదో విషయంలో ట్రెండింగ్ లో ఉంటుంది.  ముఖ్యంగా ‘దసరా’, ‘మమ్మానమ్​’ లాంటి చిత్రాలు కీర్తీని తిరిగి రేస్​లో నిలబెట్టాయి. వీటి ముందు వరకు ప్లాప్​లతో  ఇబ్బంది పడ్డ అయిన మహానటి కెరీర్​ ఈ సినిమాల బూస్టింగ్​తో దూసుకుపోతోంది.   ప్రస్తుతం కీర్తీ కోలీవుడ్​లో నాలుగైదు చిత్రాలు చేస్తోంది.  మహేష్ బాబుతో అమ్మడు సర్కారు వారి పాట అనే సినిమా చేసింది. అది కూడా పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు.

29
Keerthy suresh

 ఇక ప్రస్తుతం మరి కొన్ని డిఫరెంట్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ కు ఒక మంచి ఆఫర్ అయితే దక్కింది. బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పొందుతున్న కల్కి 2898 AD సినిమాలో ఆమె ఒక క్యారెక్టర్ కోసం వర్క్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల అధికారికంగా క్లారిటీ ఇచ్చారు.  
 

39

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" నుండి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్ ఆమె ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచెత్తుతోంది. ఈ సాయంత్రం ప్రత్యేకంగా ‘బుజ్జి’ అనే వాహనాన్ని విడుదల చేయనున్నారు. ఈ వాహనం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు. అంటే ఆమె వాయిస్ మాత్రమే వినపడుతోంది. 

49

ప్రభాస్‌ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD).  భారీ బడ్జెట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో ఇది తెరకెక్కుతోంది. ఇందులో పలు భాషలకు చెందిన అగ్ర నటీనటులు భాగం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్‌కు జోడిగా దీపికా పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. దిశా పటానీ, అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.

59

కల్కి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పలు అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. చిత్ర పోస్ట్-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే జూన్ నెలలో చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు విస్తృతంగా జరగనున్నాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ వారు 600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

69

 దీని కాన్సెప్ట్‌ గురించి దర్శకుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ..‘‘మహాభారతంతో మొదలై.. క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది. మొత్తం ఆరు వేల ఏళ్ల వ్యవధిలో ఈ కథ విస్తరించి ఉంటుంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ఆయా ప్రపంచాల్ని సృష్టించడానికి ప్రయత్నించాం’ అన్నారు.
 

79

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇందులో అశ్వత్థామ  పాత్ర పోషిస్తోన్న అమితాబ్‌ గ్లింప్స్ విడుదల చేయడం ఒక కారణమైతే.. దీని విడుదల తేదీపై జరుగుతోన్న చర్చ మరో కారణం. రిలీజ్‌ వాయిదా పడనుందంటూ కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోన్న విషయం తెలిసిందే.  
 

89

ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అయితే, అనుకోని కారణాల వల్ల దీన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా తెలిపింది. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ‘కల్కి’ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. 

99

సైన్స్‌ ఫిక్షన్‌ కథతో, పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్‌ ‘భైరవ’గా కనిపిస్తుండగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్ అశ్వత్థామగా నటించనున్నారు.  కమల్‌హాసన్‌ (Kamal Haasan) ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపిక పదుకొణె నటిస్తుండగా పశుపతి, దిశాపటానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

click me!

Recommended Stories