
బాలయ్య,బోయపాటి ఈ కాంబినేషన్ అంటే ట్రేడ్ లో, అభిమానుల్లో ఓ రేంజి క్యూరియాసిటీ.‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో హ్యాట్రిక్ హిట్స్ కొట్టడమే అందుకు కారణం. దాంతో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించే వీరి కలయికలో మరో చిత్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ‘అఖండ’కు సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది. దాని అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అదిరియే న్యూస్ బయిటకు వచ్చింది. అదే ఈ సినిమా బడ్జెట్.
డైరెక్టర్ బోయపాటి శీను రీసెంట్ గా 'స్కంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆయన ఎటువంటి ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయలేదు. గతంలో 'అఖండ 2' సినిమాను తెరకెక్కించే ప్లాన్స్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమా గురించి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. అయితే ఈ విషయంపై ఇప్పటికే చాలా సార్లు డైరెక్టర్ స్పందించారు. 'అఖండ 2' గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు.
'అఖండ 2' ప్రస్తుతం స్క్రిప్టింగ్ దశలో ఉందని ఇందులోనూ తొలి భాగంలాగే పలు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నట్లు డైరెక్టర్ వెల్లడించారు. అయితే ఎన్నికలు తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటిస్తానంటూ తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు అయ్యిపోయాయి. త్వరలోనే ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ క్రమంలో బాలయ్య, బోయపాటి సినిమా గురించిన అప్డేట్స్ మొదలుకానున్నాయి. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తీయటానికి నిర్మాతలు ఫిక్స్ అయ్యిపోయారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా స్క్రిప్టు లాక్ అయ్యి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. షూటింగ్ ఆగస్ట్ తర్వాత ఉంటుంది. 14 రీల్స్ ప్లస్ వారు పొలిటీషన్ కేసినేని చిన్ని తో కలిసి ఈ సినిమాని నిర్మిచబోతున్నారు. అలాగే ఈ సినిమాకు 150 కోట్లు బడ్జెట్ పెట్టబోతున్నారు. బాలయ్య, బోయపాటి ఇద్దరూ ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్స్ తీసుకోబోతున్నారు. 150 కోట్లు అనేది బాలయ్య సినిమాకు రికార్డ్ బడ్జెట్.
ఇక "అఖండ 1 ఎలా ఉందో అలాగే ఈ రెండో భాగంలోనూ పలు ఆసక్తికరమైన అంశాలు ఉంటాయి. అఖండలో, కథ చిన్నపిల్ల, ప్రకృతి, అలాగే దేవుని చుట్టూ తిరుగుతుంది. అదేవిధంగా అఖండ 2లోనూ ఉంటుంది. కానీ ఈ సారి నేను సమాజానికి ఉపయోగపడేలా ఎలిమెంట్స్ ఉండేలా రూపొందిస్తున్నాను" అంటూ బోయపాటి శ్రీను అన్నారు.
బోయపాటి శ్రీను మాట్లాడుతూ...‘అఖండ’కు సీక్వెల్ ఎప్పుడని నన్ను ఎంతో మంది అడుగుతున్నారు. ప్రస్తుతం ఎటుచూసినా ఎన్నికల హడావుడే కనిపిస్తోంది. కాబట్టి ఎన్నికలు ముగిశాక ఈ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన విడుదల చేస్తాం. వీలైనంత త్వరలో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాం. దైవత్వం మనందరిలో ఒక భాగం. ఈ విషయాన్ని తెరపైకి తీసుకు వస్తే ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది’’ అని చెప్పారు.
మరోవైపు బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేయనున్నట్లు ఆ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. కానీ హీరో ఎవరనే డీటేయిల్స్‌ను మాత్రం చెప్పలేదు. మరోవైపు బోయపాటి అప్పటికే అల్లు అర్జున్, సూర్య(కోలివుడ్) కోసం కథలను కూడా సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం సాగింది. ఇప్పుడా హీరోలు ఇద్దరు ప్రస్తుతం టాలీవుడ్లో ఇతర చిత్రాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నారు.
బాలయ్య ప్రస్తుతం బాబీ రూపొెందిస్తున్న NBK 109లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత బాలయ్య ఇప్పటికైతే ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. కాబట్టి ఖచ్చితంగా బోయపాటితో కలిసి అఖండ 2 కోసం పని చేసే అవకాశముంది.
స్కంద సినిమా కంటే ముందే అల్లు అర్జున్‌తో బోయపాటి ఓ సినిమా చేయాల్సి ఉంది. వీరి కాంబోలో గతంలో వచ్చిన సరైనోడు సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో మరోసారి బోయపాటితో సినిమాకి బన్నీ సై అన్నాడు. కానీ పుష్ప సినిమా రెండు భాగాలుగా తీయాల్సి రావడంతో బోయపాటి చిత్రం వెనక్కి వెళ్లిపోయింది. దీంతో అంతలో రామ్‌తో స్కంద సినిమా తీశారు బోయపాటి. అది పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఇప్పుడు బన్నీ ఛాన్స్ ఇస్తాడో లేదో అనేది డౌటే. అందులోనూ ప్రస్తుతం పుష్ప తర్వాత బన్నీ క్రేజ్ వేరే లెవల్‌కి వెళ్లిపోయింది. ఇక నుంచి చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా లెవ్లలోనే చేయాలని బన్నీ అనుకుంటున్నాడు. అందుకే పుష్ప 2 తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయాలనుకుంటున్నాడు బన్నీ.
వచ్చే నెలలో ఓ చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అఖండ పాత్ర తాలూకు పరిచయ షాట్స్ ను తీసారట. అనంతరం.. మరో రెండు నెలల తర్వాత రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేయాలని బోయపాటి ప్లాన్ చేస్తున్నాడు.
అఖండ 2 కోసం అరకు, కొచ్చి లాంటి ప్రదేశాల్లో కొన్ని అద్భుతమైన లోకేషన్స్‌ను మూవీ యూనిట్ పరిశీలించిందట. ఇక కథ ప్రకారం.. సినిమా పూర్తిగా శైవత్వం పై సాగుతుందని.. హిందుత్వానికి ప్రతిరూపం దక్షిణ భారత దేశం అనే కోణంలో సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే..హిందూ దేవాలయాలకు సంబదించిన లింక్స్ తో పాటు దక్షిణ భారత దేశం గొప్పతనాన్ని కూడా ఈ సినిమాలో బాగా ఎలివేట్ చేస్తున్నారని తెలుస్తోంది.