Keerty Suresh Chinni Movie Review: కీర్తి సురేష్ చిన్ని మూవీ రివ్యూ 

First Published | May 6, 2022, 12:39 PM IST

మహానటి మూవీ తర్వాత కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి చిత్రాలు ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కాయి. అయితే ఒక్క చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవడం విశేషం. చిన్ని మూవీతో కీర్తి మరో ప్రయత్నం, ప్రయోగం చేయగా... ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.. 

Keerthy Suresh- chinni movie review

తమిళ సాని కాయిధమ్ (Saani Kaayidham) చిత్రాన్ని తెలుగులో చిన్ని టైటిల్ తో విడుదల చేశారు. అమెజాన్ ఒరిజినల్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిన్ని నేరుగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. సీరియస్ అండ్ సీరియల్ కిల్లర్ గా కీర్తి ట్రైలర్ లో భయపెట్టారు. కీర్తి నుండి ఓ ప్రయోగాత్మక చిత్రం వస్తున్నట్లు ప్రేక్షకులు ఓ అంచనాకొచ్చారు.

Keerthy Suresh- chinni movie review

కథ:
80ల కాలంలో పేదవారిపై అగ్రవర్ణాల ఆధిపత్యం, అణచివేతలు...  అణగారిన ప్రజలపై ధనికుల దౌర్జన్యాలు కథావస్తువుగా తీసుకొని తెరకెక్కిన రివేంజ్ డ్రామా ఇది. చిన్ని(కీర్తి సురేష్) భర్త మారప్ప ఓ రైసు మిల్లులో వర్కర్. రైసు మిల్లు యజమానులకు వ్యతిరేకంగా ఊరిలో రాజకీయాలు చేస్తున్నాడనే నెపంతో మారప్పతో గొడవపడి అతడ్ని అవమానించి పని నుండి పంపేస్తారు. వృత్తిరీత్యా కానిస్టేబుల్ అయిన చిన్ని భర్త మిల్లు యజమానులతో గొడవపడి పని పోగుట్టుకోవడాన్ని ఇష్టపడదు. భర్త మారప్పకు నచ్చ జెప్పి వాళ్లకు క్షమాపణలు చెప్పి పనిలో చేరమని కోరుతుంది. దానికి ఒప్పుకున్న మారప్ప మిల్లు యజమానులను కలిసి క్షమాపణలు చెబుతాడు. అయితే వాళ్ళు మారెప్ప ముందే భార్య చిన్నిపై అవమానకర వ్యాఖ్యలు చేస్తారు. దీంతో ఆగ్రహానికి గురైన మారప్ప యజమాని ముఖంపై ఉమ్మిఊసి అవమానిస్తాడు. 

తమ వద్ద పని చేసే ఓ కూలీ అందరి ముందు ముఖంపై ఉమ్మి అవమానించడాన్ని యజమాని సహించలేడు. దానికి ప్రతీకారంగా చిన్ని కుటుంబానికి తీరని అన్యాయం చేస్తారు. చిన్ని కుటుంబానికి వారు తలపెట్టిన అన్యాయం ఏమిటీ?  రంగయ్య(సెల్వరాఘవన్) సహాయంతో చిన్ని వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అసలు రంగయ్యకు చిన్నికి ఉన్న సంభందం ఏమిటీ? అనేది మిగతా కథ.. 


Keerthy Suresh- chinni movie review

చిన్ని (Chinni Movie Review) పూర్తిగా ఓటిటి ఫార్మాట్ దృష్టిలో పెట్టుకొని ఓ సిరీస్ మాదిరి తెరకెక్కించారు. కథలో డెవలప్మెంట్స్  ఎపిసోడ్స్ మాదిరి అంకాలుగా విభజించి ప్రజెంట్ చేశారు. 80ల నాటి నేపథ్యం, కాల పరిస్థితులు విజువల్స్ రూపంలో ఒడిసిపట్టారు. పాత్రలు వాటి తీరు చాలా సహజంగా ఉంటాయి. కథలో కొంత లాజిక్ మిస్ అయినా సినిమా చూస్తున్నామన్న భావన కలగదు. కళ్ళ ముందు వాస్తవాలు నడుస్తున్నట్లు ఉంటాయి.

Keerthy Suresh- chinni movie review


దీనికి ముఖ్య కారణం కీర్తి సురేష్ (Keerty Suresh), సెల్వ రాఘవన్ నటన. ఇద్దరూ ఒకరికొకరు పోటీపడి మరి నటించారు. డీగ్లామర్ పాత్రలో కీర్తి చక్కగా ఒదిగిపోయారు. కోపం, ఎమోషన్స్ ఆమె పలికించిన తీరు అద్భుతం. అలాగే సెల్వరాఘవన్ కూడా ఎక్కడా తగ్గలేదు. దర్శకుడైన సెల్వరాఘవన్ ప్రొఫెషనల్ నటులు కూడా చేయలేరేమో అన్నట్లు పాత్ర పండించారు. సినిమా మొత్తం కీర్తి, సెల్వరాఘవన్ (Selvaraghavan)తమ పెర్ఫార్మన్స్ పై నెట్టుకొచ్చారు. విజువల్స్, కెమెరా వర్క్ చిన్ని మూవీలో చెప్పుకోవాల్సిన అంశాలు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి. రెండు గంటల నిడివి కలిగిన ఈ రివేంజ్ డ్రామా ఆసక్తికరంగానే సాగుతుంది. 

Keerthy Suresh- chinni movie review


అయితే చిన్ని రొటీన్ రివెంజ్ డ్రామా. ఇప్పటికే పదుల సంఖ్యలో ఈ తరహా కథలు వచ్చాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు వచ్చాయి. అలాగే సినిమాలో ఎటువంటి మలుపులు ఉండవు. సినిమా మొదలైన కాసేపట్లోనే కీర్తి సురేష్ లక్ష్యం ఏమిటో? జరగబోయే తతంగం ఏమిటో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఫ్లాట్ నేరేషన్ వలన స్క్రీన్ ప్లే పై పెద్దగా కసరత్తు చేయలేదనిపిస్తుంది. చెప్పాల్సింది సూటిగా చెప్పడమే అని డైరెక్టర్ డిసైడై ఉండవచ్చు. 
 

Keerthy Suresh- chinni movie review

చిన్ని మూవీలో లోపాలు చెప్పాలంటే... పాత్రలు, వాటి నేపథ్యం రియలిస్టిక్ గా ఉన్నా... కథలో లాజిక్ మిస్ అయ్యింది. ఓ మహిళా జడ్జి హత్యకు గురైతే పోలీసు యంత్రాంగం ఊరుకుంటుందా?. చట్టంలో చలనం రాదా?. చిన్ని కథలో అదేమీ ఉండదు. చిన్ని, రంగయ్య హత్యలు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ హత్యలు చేస్తుంది ఎవరో తెలిసి కూడా చట్టం వాళ్ళను పట్టించుకోదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ యాంగిల్ సినిమాలో చూపించలేదు. 
 

Keerthy Suresh- chinni movie review

వాళ్లకు అన్యాయం చేసిన వాళ్ళు ఆమెను ఎదుర్కోవడమే అన్నట్లు చూపించారు. ఓ సాధారణ మహిళ మరణాయుధంగా మారడం కూడా కొంచెం నమ్మశక్యంగా ఉండదు. మొత్తంగా చెప్పాలంటే చిన్ని మూవీ రా అండ్ రస్టిక్ రివేంజ్ డ్రామా. కీర్తి, సెల్వరాఘన్ అద్భుత నటన ప్రేక్షకులకు ట్రీట్. లాజిక్ మరచి, అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకునే చిత్రం. పాత కథను దర్శకుడు చాలా వరకు మెప్పించేలా ప్రజెంట్ చేశారు. 
 

Keerthy Suresh- chinni movie review

మూవీ: చిన్ని

నటీనటులు: కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ఓటీటీ

ఫ్లాట్ ఫార్మ్: అమెజాన్ ప్రైమ్

డైరెక్టర్: అరుణ్ మతేశ్వరన్

రేటింగ్: 3/5

Latest Videos

click me!