Keerthy Suresh in X-mas: క్రిస్మస్‌ వేడుకల్లో కీర్తిసురేష్‌.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్‌..

Published : Dec 25, 2021, 06:17 PM IST

`మహానటి` కీర్తిసురేష్‌ ట్రెడిషనల్ గా కనిపిస్తూనే ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఆమె అద్బుతమైన నటనతోనే కాదు, తన క్యూట్‌ ఫోటోలతోనూ కనువిందు చేస్తుంది. ఇప్పుడు క్రిస్మస్‌ సెలబ్రేషన్‌లో మునిగితేలుతుంది. మెస్మరైజ్‌ చేస్తుంది. ఆమె పంచుకున్న లేటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

PREV
19
Keerthy Suresh in X-mas: క్రిస్మస్‌ వేడుకల్లో కీర్తిసురేష్‌.. క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్‌..

కీర్తిసురేష్‌ ఎక్కడున్నా కచ్చితంగా క్రిస్మస్‌ వేడుకలను జరుపుకోవాల్సిందే. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవాల్సిందే. నేడు ఆమె మేరీ క్రిస్మస్‌ వేడుకల్లో బిజీగా గడుపుతోంది. తన ఇంట్లోనే క్రిస్మస్‌ చెట్టుని డెకరేట్‌ చేసుకుని ఫోటోలకు పోజులిచ్చింది. తన ఫ్రెండ్స్ తో కలిసి కీర్తిసురేష్‌ సెలబ్రేషన్‌లో మునిగి తేలుతుండటం విశేషం. ఈ పిక్స్ ని పంచుకుంటూ అభిమానులకు విషెస్‌ తెలిసింది కీర్తిసురేష్‌. 

29

ఈ సందర్భంగా కీర్తి ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. క్రిస్మస్‌ షర్ట్ ధరించి తన క్యూట్‌ పెట్‌ డాగ్‌తో కలిసి పోజులివ్వడం మరింతగా ఆకట్టుకుంటుంది. తనతోపాటు తన పెట్‌ డాగ్‌ని రెడీ చేసి ఫోటో దించగా అది మరింత క్యూట్‌గా కనిపిస్తుంది. ప్రస్తుతం కీర్తి లేటెస్ట్ క్రిస్మస్‌ సెలబ్రేషన్‌ పిక్స్ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

39

కీర్తిసురేష్‌ ప్రస్తుతం వరుసగా సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె మహేష్‌బాబుతో `సర్కారు వారి పాట`లో నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మరోవైపు చిరంజీవితోనూ ఓ సినిమా చేస్తుందికీర్తి. `భోళా శంకర్‌`లో ఆయనకు చెల్లి పాత్రలో కనిపించబోతుంది. 
 

49

మరోవైపు కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన `గుడ్‌లక్‌ సఖీ` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 31కి విడుదల చేయాలని భావించారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ లేదు. మరోవైపు తమిళంలో, మలయాళంలో సినిమాలతో బిజీగా ఉంది కీర్తిసురేష్‌. 
 

59

ఇదిలా ఉంటే కీర్తిసురేష్‌ ఇప్పుడు చెల్లెలి పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఇటీవల ఆమె రజనీకాంత్‌ నటించిన `అన్నాత్తే`(పెద్దన్న) చిత్రంలో రజనీకి చెల్లి పాత్రలోనటించింది. సూపర్‌ స్టార్ తో సినిమా అనేది, తన పాత్ర చుట్టూతే కథ తిరగడం నేపథ్యంలో సిస్టర్‌ రోల్‌కి ఓకే చెప్పింది కీర్తి. ఇప్పుడు చిరు చిత్రంలోనూ చెల్లిగా నటిస్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

69

దీంతో కీర్తిసురేష్‌పై అనేక రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కీర్తి.. చిత్ర పరిశ్రమకి చెల్లిగా మారబోతుందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న ఆమె, కెరీర్‌ పీక్‌ గా ఉన్న టైమ్‌లో ఇలాంటి రోల్స్ చేస్తే ఆమెకి లాంగ్‌ రన్‌ కష్టమే అనే టాక్‌ వినిపిస్తుంది. ఇకపై కూడా సిస్టర్స్ రోల్సే వస్తాయని అంటున్నారు. మరి వాటిని దాటుకుని కీర్తి హీరోయిన్‌గా రాణిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది.

79

`మహానటి` చిత్రంతో నేషనల్‌ వైడ్‌గా పాపులర్‌ అయ్యింది కీర్తిసురేష్‌. అందులో సావిత్రి పాత్రలో జీవించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. మహానటి సావిత్రగా కీర్తి నటన సర్వత్రా ప్రశంసలందుకుంది. నేటి తరానికి సావిత్రి అంటే కీర్తినే గుర్తొస్తుందంటే అతిశయోక్తి కాదు. 

89

ఈ సినిమాతో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కీర్తికి ఆ తర్వాత ఆ స్థాయి సినిమాలు పడలేదు. కథల ఎంపికలో చేసిన పొరపాట్ల కారణంగా ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందని చెప్పొచ్చు. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేసినా అవి బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. దీంతో కీర్తి గ్రాఫ్‌ తగ్గుతూ వస్తోంది. 

99

దీనికితోడు ఇప్పుడు సిస్టర్ రోల్స్ చేయడం మరింతగా మైనస్‌గా మారుతుందనే టాక్‌ వినిపిస్తుంది. మహేష్‌తో చేస్తున్న `సర్కారు వారి పాట` సక్సెస్‌పై హీరోయిన్‌గా కీర్తి కెరీర్‌ డిపెండ్‌ అయి ఉంటుందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories