2021 మిస్ అయినా... నెక్ట్స్ ఇయర్ అంతకు మించి ట్రీట్ ఇస్తామంటున్న స్టార్ హీరోలు

First Published | Dec 25, 2021, 4:11 PM IST

కరోనా ఎఫెక్ట్ వల్ల ఈ ఏడాది చాలామంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అని ప్రకటించినా కరోనా భయంతోనో, పోటీ వద్దనుకోనో తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నింటిని వాయిదా వేసారు. దీంతో కొంతమంది స్టార్ హీరో కెరీర్ లో 2021 మాయమయ్యింది.  ఈ ఏడాది ఏ హీరో థియేటర్ లో కనిపించలేదు చూద్దాం.

ఈ ఏడాది కుదరక పోయినా..  నెక్ట్స్ ఇయర్ రఫ్పాడిస్తామంటున్నారు టాలీవుడ్ స్టార్స్ కొంత మంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డా...వచ్చే ఏడాది వాళ్ల ఫేవరెట్ హీరోల సినిమాలు రిలీజవుతూన్నాయన్న ఆలోచనతో ఖుషీగా ఉన్నారు. అందులో మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమాలేవీ 2021లో రిలీజ్ కాలేదు. రెండేళ్ళ నుంచి ఈ హీరోల సినిమాలు థియేటర్ లో కిపించలేదు. ఎన్టీఆర్ కు 2018 అరవింద సమేత తరువాత సినిమా రిలీజ్ లేదు. అటు రామ్ చరణ్ కు 2019 వినయ విధేయ రామ తరువాత రిలీజ్ లేదు.  అయితే 2022 సంవత్సరం జనవరి 7న ఈ ఇద్దరు హీరోలు కలిసి సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేయబోతున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా రచ్చ చేయబోతున్నారు.

Mahesh Babu

అసలే ఏడాదికి ఒక్క సినిమానే చేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన కెరిర్ లో ఒక ఏడాది రెండు సినిమాలు వచ్చింది చాలా తక్కువ, అటువంటిది అసలు ఈ ఏడాది మహేష్ బాబు నుంచి నో రిలీజ్. 2020 లో కోవిడి స్టార్ట్ అవుతున్న టైమ్ లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టాడు మహేష్. ఈ ఏడాది కోవిడ్ వల్ల సినిమా రిలీజ్ కాలేదు.  అయితే వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో మహేష్ నటించిన సర్కారు వారి పాట డేట్ ఫిక్స్ చేసుకుంది. పరశురామ్ డైరెక్షన్ లో నటిస్తున్న ఈమూవీ ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి బరిలో ఉన్న సక్కారువారి పాట.. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవుతుండటంతో సమ్మర్ కు మారిపోయింది.  


Prabhas Radhe Shyam

ఇక యూనివర్సల్ స్టార్ ప్రభాస్ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అసలు ప్రభాస్ సినిమా థియేటర్ కు రాక రెండేళ్ళు. సాహోతరువాత వరుస సినిమాలు ప్రకటించుకుంటూ పోయాడు ప్రభాస్. కాని 2021 లో రాధేశ్యామ్ రిలీజ్ చేయాలని ఎంత ప్రయత్నం చేసినా.. అది కుదరలేదు. ఇక నెక్ట్స్ ఇయర్  ఫ్యాన్స్ కు భారీ ట్రీట్ ఇవ్వబోతున్నాడు.  2022 సంక్రాంతికి రాధేశ్యామ్ తో స్టార్ట్ చేసి.. ఆదిపురుష్, సలార్ లు కూడా నెక్ట్స్ ఇయర్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఓ గ్లోబల్ స్టార్... ఒకే ఏడాది మూడు సినిమలతో రావడమంటే మామూలు విషయం కాదు. సో 2022 మామూలుగా ఉండందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలేవీ ఈ ఏడాది రిలీజ్ కాలేదు. అయితే సీనియర్ స్టార్స్  బాలయ్య, వెంకీ, నాగ్ సినిమాలు మాత్రం ఈ ఏడాది  సినిమాలతో సందడి చేశారు. బాలయ్య అయితే అఖండతో దడదడలాడించాడు. సడెన్ గా రిలీజ్ డేట్ అనౌస్ చేసి.. భారీ  సక్సెస్ ను మూటకట్టుకున్నాడు బాలయ్య . కాని మెగాస్టార్ మాత్రం ఆచార్య ను నెక్ట్స్ ఇయర్ కు  పోస్ట్ పోన్ చేశారు. నెక్ట్స్ ఇయర్ నాదే అన్నట్టు ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు మెగాస్టార్. ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కాబోతుండగా గాడ్ ఫాదర్, భోళాశంకర్ కూడా మెగాఫ్యాన్స్ ను 2022లో పలకరించే అవకాశాలున్నాయి.

రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది రిలీజ్ కాలేదు. షార్ట్ టైమ్ లో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్.. ఆ మధ్య వరుసగా ఫెయిల్యూర్స్ ను ఫేస్ చేశాడు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్  సినిమాలు డిజాస్టర్స్ అవ్వడంతో..ఈసారి జాగ్రత్తగా అడుగులు వేయాలి అని ఫిక్స్ అయ్యాడు. ప్యాన్స్ కు ఎప్పుడు కనెక్టింగ్ లో ఉండే రౌడీ హీరో... పూరీ జగన్నాథ్  కాంబినేష్ లో చేస్తున్న లైగర్ తో నెక్ట్స్ ఇయర్ రాబోతున్నాడు. 2020 అగస్ట్ 25న ఈమూవీ రిలీజ్ కాబోతోంది.  

Varun Tej

యంగ్ హీరోల్లో మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ కూడా ఈ ఏడాది కనిపించలేదు. 2019 లో గద్ద కొండ గణేష్ సూపర్ హిట్ తరువాత థియేటర్ లో వరుణ్ తేజ్ సినిమా కనిపించలేదు. ప్రయోగాలు బాగా కలిసొస్తున్నాయి వరుణ్ తేజ్ కు . అందుకే ఈసారి కూడా స్పోర్డ్స్ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా చేస్తేన్డు గని టైటిల్ తో కిరణ్ కొర్ర పాటి డైరెక్షన్ లో మూవీ తెరకెక్కుతోంది. ఈమూవీని వచ్చే ఏడాది మార్చ్ 18న రిలీజ్ చేయబోతున్నారు. అల్లు శిరీష్,నిఖల్, వంటి వాళ్లు కూడా థియేటర్స్ కనీసం ఓటీటీల్లో కూడా సందడి చేయలేదు. ఈ హీరోలు జీరో రిలీజ్ స్టార్స్ గా మిగిలిపోగా ఈ హీరోల సినిమాలు వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయో చూడాలి.

Latest Videos

click me!