కీర్తి సురేష్‌, అనపమా, కృతి శెట్టి.. కట్టుబాట్లని బ్రేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు.. అభిమానుల హార్ట్ బ్రేకే?

Published : Mar 01, 2024, 04:30 PM IST

కీర్తిసురేష్‌, అనుపమా పరమేశ్వరన్‌, కృతి శెట్టి మొదట్లో చాలా పద్ధతిగా కనిపించారు. కానీ ఇప్పుడు కట్టుబాట్లని బ్రేక్‌ చేస్తున్నారు, డోస్‌ పెంచుతూ షాకిస్తున్నారు.   

PREV
19
కీర్తి సురేష్‌, అనపమా, కృతి శెట్టి.. కట్టుబాట్లని బ్రేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు.. అభిమానుల హార్ట్ బ్రేకే?

సినిమా అంటేనే రంగుల ప్రపంచం, దాన్ని మించిన గ్లామర్‌ ప్రపంచం. ఇక్కడ అందానికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. అందమే చాలా లెక్కల్ని మార్చేస్తుంది. అవకాశాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇందులో హీరోయిన్ల గ్లామర్‌ కీలక పాత్ర పోషిస్తుంది. వారికి ఛాన్స్ లు రావాలంటే అందాల విందు తప్పదు. ఎంత యాక్టింగ్‌ చేసినా స్కిన్‌ షో చేయకపోతే వ్యాపారం బెడిసికొడుతుంది. సినిమాలో ఏదో వెలితి ఉంటుంది. ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యే అవకాశం కూడా ఉంది. 

29

అందాల విందు చేయకుండా, స్క్రిన్ షో చేయకుండా చాలా తక్కువ మంది మాత్రమే సర్వైవ్‌ కాగలరు. అది కూడా ఒకప్పుడు మాత్రమే. ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా ఆ పనిచేయాల్సింది. మరీ స్టార్ హీరో రేంజ్‌ దాటి లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార, అనుష్క రేంజ్‌ అయితే తప్ప, మిగిలిన అంతా అందాల విందు వడ్డించాల్సిందే. అలా లేదు అంటూ కొంత మంది హీరోయిన్లు కట్టుబాట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని బ్రేక్‌ చేస్తున్నారు. అందులో అనుపమా పరమేశ్వరన్‌, కృతి శెట్టి, కీర్తిసురేష్‌ వంటి భామలున్నారు. 
 

39

కీర్తి సురేష్‌ ట్రెడిషన్‌కి పెద్ద పీటవేస్తుంది. ఆమె `మహానటి` తర్వాత అలాంటి పాత్రలతో మెప్పిస్తూ వస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తుంది. ఆ మధ్య `సర్కారు వారి పాట`లో కాస్త హాట్ గా కనిపించింది. నెమ్మదిగా తన బౌండరీలు బ్రేక్ చేస్తూ వస్తోంది కీర్తి సురేష్‌. సోషల్‌ మీడియాలో మాత్రం మరింత ఓపెన్‌ అవుతుంది. క్లీవేజ్‌ షో చేస్తుంది. అదే సమయంలో ఇప్పుడు ఆమె కాస్త్ బోల్డ్ రోల్స్ కూడా ఓకే చెబుతుందట. 

49

దీనికి కారణం సినిమా అవకాశాలు, మారుతున్న ట్రెండ్‌ అని చెప్పొచ్చు. సినిమాల్లో కాస్త హాట్‌గా కనిపించాల్సిందే. అన్ని సినిమాల్లో కట్టుబాట్టుకు పెద్ద పీఠ వేయడం సాధ్యం కాదు, కొన్ని సినిమాల్లో చూసి చూడనట్టు ఉండాల్సిందే. ఇప్పుడు కీర్తి సురేష్‌ కూడా అదే చేస్తుందట. రాబోయే సినిమాల్లో ఆమె లెక్క వేరేలా ఉంటుందంటున్నారు. మరోవైపు సోషల్‌ మీడియాలో మాత్రం ఆ హద్దులు సరి చేసిందీ బ్యూటీ. అవకాశాల వేటలో ఆమాత్రం డోస్‌ పెంచక తప్పడం లేదంటున్నారు. 

59

మరోవైపు అనుపమా పరమేశ్వరన్‌.. ట్రెడిషన్‌కి పెద్ద పీఠ వేసింది. ఆమె హోమ్లీ బ్యూటీగా మెప్పించింది. ప్రారంభంలో అనుపమా పరమేశ్వరన్‌ చేసిన పాత్రలు పూర్తిగా వేరే. స్వచ్ఛమైన పదహారణాల పడుచు పిల్లలు, లెహంగా ఓణలో మెరిసింది. చీరలో అలరించింది. `ప్రేమమ్‌`, `అ ఆ`, `శతమానం భవతి` వంటి సినిమాలో ఆమె కనిపించింది వేరే. కానీ ఇప్పుడు కనిపిస్తుంది మరో లెవల్‌. 
 

69

అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు తనలోని `2.0` చూపిస్తుంది. మనం చూసేది అనుపమనేనా అని ఆశ్చర్యపోయేలా, కళ్లు సరిచేసుకునే ఆమె పాత్రలు, ఆమె ఫోటో షూట్లు ఉంటున్నాయి. సోషల్‌ మీడియాలో చాలా కాలంగానే దుమారం రేపుతుంది. పొట్టి దుస్తుల్లోకనిపించి షాకిచ్చింది. విరహంతో కూడిన అందాల విందు చేస్తూ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. ఇటీవల సినమాల్లోనూ దాన్ని తీసుకొచ్చింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సినిమాల్లో చేసినట్టు సోషల్‌ మీడియాలోనూ ఉండటం లేదు. 
 

79

ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో `టిల్లు స్వ్కైర్‌` మూవీ ప్రధానంగా ఉంది. ఇందులో ఆమెని చూసి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. హీరో సిద్దు జొన్నలగడ్డ మీద కూర్చొని లిప్‌ లాక్‌ లు పెట్టింది. ఆ లిప్‌ లాక్‌లు కూడా గతంలో ఎప్పుడూ చూసి ఉండరేమో అనేలా ఉంటాయి. రొమాంటిక్‌ సీన్లు, బోల్డ్ సీన్లలో ఆమె లెక్క వేరే లెవల్‌. దీంతో ఆమెని ఆరాధించిన అభిమానులు ఇలా చూసి గుండెలు పగిలిపోయే పరిస్థితి ఎదురయ్యింది. అంతగా తమ మలయాళ కట్టుబాట్లని బ్రేక్‌ చేసి రెచ్చిపోతుందీ హాట్‌ బ్యూటీ. 
 

89

ఇంకోవైపు కృతి శెట్టి కూడా ఇదే దారిని ఎంచుకుంటుంది. ఆమె కూడా ప్రారంభంలో చాలా పద్దతిగానే కనిపించింది. `ఉప్పెన`లో చాలా క్లీన్‌గా ఉంది. రొమాంటిక్‌ సాంగ్‌లో మెరిసింది. ఆ తర్వాత నటించిన చిత్రాల్లో కాస్త గ్లామరస్‌గా కనిపించింది. కానీ పెద్దగా హద్దులు మీరినట్టు అనిపించలేదు. ఇక సోషల్‌ మీడియాలో అయితే చాలా పద్దతిగానే కనిపించింది. కట్టుబాట్ల విషయంలో ఆమె కంట్రోల్‌లోనే ఉంది. 
 

99

కానీ ఇప్పుడు మాత్రం వాటికి బ్రేక్‌ చెబుతుందట. నెమ్మదిగా ఒక్కో రూల్‌ బ్రేక్‌ చేస్తుంది. తన హద్దులు చెరిపేస్తూ గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. అందాల విందుతో అవకాశాల వేట కొనసాగిస్తుంది. మేకర్స్ కి ఎర వేస్తుంది. సినిమాల్లో సర్వైవ్‌ కావాలంటే గ్లామర్‌ షో తప్పదని తెలుసుకుంది. ఇప్పుడు ఆ సాంకేతాలను పంపిస్తూ సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటో షూట్లుచేస్తుంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో తాను కూడా ట్రెండ్‌ని ఫాలో కావాల్సిందే అనే రూల్‌కి పెద్ద పీఠ వేస్తుంది కృతి శెట్టి. మరి ఈ బ్యూటీకి ఈ గ్లామర్‌ విందు ఎలాంటి ఆఫర్లని తీసుకొస్తుందో చూడాలి.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories