Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య రోజూ ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో తెలుసా? స్నేహారెడ్డి ఫిట్ నెస్ సీక్రెట్

Published : Mar 01, 2024, 03:44 PM IST

అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) ఎంత ఫిట్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పుడూ స్లిమ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటూ ఉంటారు. మరీ ఆమె ఫిట్ నెస్ వెనక ఉన్న రహస్యం ఏంటో తాజాగా రివీల్ చేసింది.

PREV
16
Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్య రోజూ ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో తెలుసా? స్నేహారెడ్డి ఫిట్ నెస్ సీక్రెట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. టాలీవుడ్ బన్నీనే  టాప్. ఇక ఆయన భార్య అల్లు స్నేహా రెడ్డి కూడా ఇంటర్నెట్ లో భారీగానే ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. 
 

26

కేవలం ఇన్ స్టా గ్రామ్ లోనే అల్లు స్నేహకు 9.1 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఇక స్నేహ ఎప్పుడూ తన అభిమానుల కోసం ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ వస్తుంటుంది. 

36

ఈ క్రమంలో తాజాగా తన ఫిట్ నెస్ కు సంబంధించిన సీక్రెట్ ను రివీల్ చేసింది. ఈ సందర్భంగా ఓ వీడియోను కూడా పంచుకుంది. రోజూ ఉదయం లేవగానే తను చేసే వర్కౌట్స్ గురించి చెప్పింది.

46

ఫిట్ గా కనిపించేందుకు తన ఇంటి లాన్ లో డైలీ వర్కౌట్స్ చేస్తారని వీడియో ద్వారా తెలిపారు. తొలుత స్క్వాట్స్, 2.0 కేజీ గల డంబెల్స్ తో లాటెరల్, ఫ్రంట్ రేయిజ్, క్రంచెస్, స్క్రెచ్చెస్ చేస్తానన చెప్పారు. 

56

అంతే కాదు.. వీడియోలో ఎలా చేయాలో కూడా చూపించారు స్నేహరెడ్డి. తన ఫిట్ నెస్ మంత్రాన్ని తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. ఇలా రోజూ వర్కౌట్ చేస్తే ఫిట్ గా ఉండొచ్చని తెలిపింది. 

66

ఇక అల్లు స్నేహా రెడ్డి బన్నీ గురించి, వారి పిల్లలు అల్లు అర్హా, అల్లు అయాన్ గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే వస్తుంటారు. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ ను కూడా పరిచయం చేస్తూ ఫొటోషూట్లు కూడా చేస్తుంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories