మహేష్ నన్ను టీజ్ చేశారు, మూడు సార్లు చెంపమీద కొట్టాను : కీర్తి సురేష్, తరువాత ఏమైందంటే...?

Published : May 04, 2022, 08:50 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తనను టీజ్ చేశాడు అంటోంది కీర్తి సురేష్. అంతే కాదు మూడు సార్లు సూపర్ స్టార్ ను చెంపదెబ్బ కొట్టాల్సి వచ్చిందంటోంది. మరి అప్పుడు మహేష్ ఏమన్నాడు...? కీర్తి సురేష్ పరిస్థితి ఏంటీ..?   

PREV
18
మహేష్ నన్ను టీజ్ చేశారు, మూడు సార్లు చెంపమీద కొట్టాను : కీర్తి సురేష్, తరువాత ఏమైందంటే...?

ప్రస్తుతం పెద్ద సినిమాల సీజన్ నడుస్తోంది. వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ నెలలో రిలీజ్ కురెడీగా ఉంది సర్కారువారి పాట సినిమా. ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి దుమ్ము రేపుతోంది. ఇక ఈమూవీలో మహేష్ సరసన  కీర్తి సురేష్ హీరోయిన్ గాసందడి చేసింది. 
 

28

ఇక ఈమూవీ రిలీజ్ కు ఇంకా  10 రోజులలోపు మాత్రమే టైమ్ ఉండటంతో.. ప్రమోషన్ల హడావిడి స్టార్ట్ చేశారు టీమ్. వరుస ఇంటర్వ్యూలతో పాటు,  రకరకాలు ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ వెకేషన్ లో ఉండగా.. హీరోయిన్ కీర్తి సురేష్ మాత్రం డైరెక్టర్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. 
 

38

సూపర్ స్టార్ సరసన అనూహ్యంగా అవకాశం వచ్చింది కీర్తి సురేష్ కు. ఇక ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు శేర్ చేసుకుంది బ్యూటీ. ఈ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. మహేష్ బాబుతో యాక్ట్ చేసిన ఎక్స్ పీరియన్స్ ను కూడా శేర్ చేసుకుంది. 
 

48

ఈ సందర్భంగా  సూపర్ స్టార్ మహేశ్ బాబు మహేశ్ బాబుకు హీరోయిన్ కీర్తి సురేశ్ క్షమాపణలు చెప్పింది. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సరదా సన్నివేశాల గురించి వివరిస్తూ.. ఆమె మహేష్ కు  సారీ చెప్పింది. 

58

షూటింగ్ టైమ్ లో మహేష్ తో  టైమ్ ఎంతో సరదాగా గడిచిపోయేదంటోంది కీర్తి. అంతే కాదు తన పంచ్ డైలాగ్స్ తో మహేశ్ బాబు తెలియకుండానే టీజ్ చేసేవారని యాంకర్ అడిని ప్రశ్నకు జవాబు ఇచ్చారు కీర్తి. సూపర్ స్టార్ తో  షూటింగ్ చేయడం చాలా సర సరదా సరదాగా ఉంటుందని చెప్పింది. 
 

68

ఓ పాట షూటింగ్ సందర్భంగా తాను టైమింగ్ ను మిస్ అయ్యానని., స్టెప్పులు మరిచిపోయానని చెప్పింది. అదే టైమ్ లో తను మహేశ్ మొహంపై రెండు సార్లు మిస్ టైమింగ్ తో కొట్టానని చెప్పింది. అప్పటికే సారీ చెప్పానని, మూడో సారీ అది రిపీట్ అయిందని ఆమె పేర్కొంది.  దాంతో ఏం జరుగుతుందా అని భయంవేసిందంటోంది కీర్తి సురేష్. 
 

78

ఇక అలా మూడు సార్లు మహేష్ చెంపమీద కొట్టేసరికి.... ఆ టైంలో తన గుండె వేగం రెట్టింపైందని చెప్పింది. భయం వేయడంతో ఏంచేయాలో తనకు తోచలేదంటోంది కీర్తి సురేష్. కాని మహేష్ మాత్రం ఎంతో సరదాగా ‘నా మీద ఏమైనా పగ ఉందా?’ అంటూ  తనను సరదాగా  ఆటపట్టించారంటోంది కీర్తిసురేష్. 
 

88

పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్కారువారి పాట సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కళావతి పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది బ్యాంకింగ్  రంగానికి సంబంధించిన స్కామ్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. 
 

click me!

Recommended Stories