పక్కింట్లో రొమాన్స్ చేసుకుంటుంటే చూడాలనిపిస్తుంది.. వింత కోరికలు బయటపెట్టిన బిగ్‌ బాస్‌ అరియానా..

Published : Jun 28, 2024, 07:40 PM IST

బిగ్‌ బాస్‌ షో ద్వారా పాపులర్‌ అయిన అరియానా తనలోని విచిత్రమైన కోరికని బయటపెట్టింది. పక్కింట్లో వాళ్లు రొమాన్స్ చేసుకుంటుంటే చూడాలనిపిస్తుందంటూ షాకిచ్చింది.   

PREV
17
పక్కింట్లో రొమాన్స్ చేసుకుంటుంటే చూడాలనిపిస్తుంది.. వింత కోరికలు బయటపెట్టిన బిగ్‌ బాస్‌ అరియానా..

యూట్యూబ్‌ యాంకర్‌గా కెరీర్‌ ని ప్రారంభించి బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది అరియానా గ్లోరీ. షోలో ఆమె రచ్చ చేసి టాప్‌ 5కి వెళ్లింది. ఆ తర్వాత ఒక్కసారిగా క్రేజీని సంపాదించుకుని సోషల్‌ మీడియాని, బుల్లితెరని ఊపేస్తుంది. సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది. రోజు రోజుకి డ్రెస్‌ సైజ్‌ తగ్గిస్తూ దుమారం రేపింది అరియానా. 

27

దీంతోపాటు బుల్లితెరపై టీవీ షోస్‌లో మెరిస్తూ ఆకట్టుకుంటుంది. అడపాదడపా ఆమె సందడి చేస్తూ మెప్పిస్తుంది. మరోవైపు సెలబ్రిటీలను కలుస్తూ వార్తల్లో నిలుస్తుంది. అలాగే రామ్‌ గోపాల్‌ వర్మతో కలిసి ఆమె చేసిన రచ్చ హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ ఇద్దరి మధ్య చిట్ చాట్‌ దుమారం రేపిన విషయం తెలిసిందే. 
 

37
pic-mallemala

ఇటీవల అటు నెట్టింట, ఇటు బుల్లితెరపై మెరుస్తూ అలరిస్తున్న అరియానా.. తాజాగా సుమ కనకాల యాంకర్‌గా చేస్తున్న `సుమ అడ్డా` షోలో పాల్గొంది. బిగ్‌ బాస్‌ పెయిర్‌ అవినాష్‌తో కలిసి ఆమె సందడి చేసింది. ఇందులో రోల్‌ రైడా, బిగ్‌ బాస్‌ సత్య కూడా పాల్గొన్నారు. ఆద్యంతం తమదైన పంచ్‌లు, ఫన్‌ యాక్టివిటీస్‌తో నవ్వులు పూయించారు. 
 

47
pic-mallemala

ఇందులో అరియానా లేడీ ఫాంటసీ విషయాలను బయటపెట్టింది. మీకు బెస్ట్ కాంప్లిమెంట్‌ ఏంటి లైఫ్‌లో అని సుమ అడగ్గా అందంగా ఉన్నానని అన్నారు అది చాలు అని చెప్పింది అరియానా. అయితే ఎక్కడికి పోయినా అమ్మాయిల వెంటపడుతుంటారు, కానీ అబ్బాయిలు నన్ను చూడను కూడా చూడరు అంటూ సుమ ముందు ఆవేదన వ్యక్తం చేసింది అరియానా. నన్ను కూడా చూడండి ప్లీజ్‌ అంటూ వేడుకుంది. 
 

57
pic-mallemala

దీనికి అటు అవినాష్‌, సత్య మాత్రమే కాదు, యాంకర్‌ సుమ కూడా ఆశ్చర్యపోయింది. ఈ సందర్భంగా అబ్బాయిలు అందరు అరియానాని కాస్త చూడండి అంటూ రిక్వెస్ట్ చేసింది. పక్కనే ఉన్న అవినాష్‌ రియాక్ట్ అవుతూ వాళ్లు అమ్మాయిలను చూస్తారుగానీ, ఆంటీని ఎందుకు చూస్తారని కామెంట్‌ చేయడంతో ఒక్కటిచ్చుకుంది అరియానా. ఆ తర్వాత సత్యతో మందేసే కామెడీ చేసి నవ్వులు పూయించారు. సుమతో అవినాష్‌ చేసిన రచ్చ హైలైట్‌గా నిలిచింది. 
 

67
pic-mallemala

ఇక చివరగా పక్కింట్లో తొగ్గి చూడటానికి సంబంధించిన ప్రశ్న అడగ్గా, వెంటనే స్పందించిన అరియానా.. నాకు పిక్కింటి వాళ్లు రొమాన్స్ చేసుకుంటుంటే చూడటమంటే ఇష్టమని తెలిపి అందరికి షాకిచ్చింది. దీంతో సుమ స్పందిస్తూ, అరియానా ఇంటి పక్కన వాళ్లు జాగ్రత్త అని చెప్పడం విశేషం. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, అరియానాలో ఇలాంటి ఫాంటసీ ఎలిమెంట్లు ఉన్నాయా? అని, వామ్మో ఇదేం చెత్త కోరికలు సామీ అని నానా రకాలుగా కామెంట్లు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. 

77
pic-mallemala

మరోవైపు `దూరేస్తా` అనే స్కిట్‌ ప్రదర్శించారు. ఇందులో అరియానా లవర్‌ చనిపోతే ఏడుస్తుంటుంది. పక్కన వచ్చిన అవినాష్‌.. ఏడుస్తూ దూరేస్తా, దూరేస్తా అంటుంటాడు. ఓరేయ్‌ నువ్వెవడిరా అంటే దూరేస్తా అనడంతో `అరేయ్‌ లెవ్‌ రా వీడెవడో దూరేస్తా` అంటున్నాడు అంటూ అరియానా ఏడవడం ఆద్యంతం నవ్వులు పూయించింది. `సుమ అడ్డా`లో హైలైట్ గా నిలిచింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories