1990లో `పుతియకాట్రు` అనే తమిళ చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఆమని. `జంబలకిడిపంబ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. `మిస్టర్ పెళ్లాం` సినిమాతోనే ఉత్తమ నటిగా నంది అవార్డుకి పోటీ పడింది. `పచ్చని సంసారం`, `శుభలగ్నం`, `అల్లరి పోలీస్`, `హలో బ్రదర్`, `ఘరానా బుల్లోడు`, `శుభ సంకల్పం`, `శుభమస్తు`, `మావిచిగురు`, `ఆ నలుగురు` చిత్రాలతో అలరించింది.