చిరంజీవి, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సినిమాలతో పోటీ పడిన ఓ చిన్న చిత్రం టాప్ 5 గ్రాసర్ గా నిలిచింది. ఆ చిత్ర హీరో మాత్రం టాలీవుడ్ లో పాలిటిక్స్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
2006 వ సంవత్సరం కొంతమంది హీరోలకు గోల్డెన్ ఇయర్ గా మారింది. అప్పటి వరకు ఉన్న మహేష్ బాబు ఇమేజ్ పూర్తిగా మారిపోయింది ఈ సంవత్సరంలోనే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన పోకిరి మూవీ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్ మూవీగా పోకిరి సంచలనం సృష్టించింది. ఆ ఏడాది మరికొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు కూడా వచ్చాయి. వెంకటేష్ లక్ష్మీ, సిద్దార్థ్ బొమ్మరిల్లు, విక్రమార్కుడు లాంటి చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి.
25
2006 టాప్ 5 మూవీస్
పోకిరి, బొమ్మరిల్లు, స్టాలిన్, విక్రమార్కుడు, లక్ష్మీ చిత్రాలు 2006లో హైయెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. టాలీవుడ్ కి బిగ్ సర్ప్రైజ్అంటే ఆ ఏడాది బొమ్మరిల్లు సినిమానే అని చెప్పాలి. చిన్న చిత్రంగా విడుదలైన బొమ్మరిల్లు సంచలన విజయం అందుకుంది. చిరంజీవి స్టాలిన్, మహేష్ బాబు పోకిరి లాంటి చిత్రాలతో పోటీ పడి ఆ ఏడాది టాప్ 5 గ్రాసర్ గా బొమ్మరిల్లు నిలిచింది.
35
అద్భుతం చేసిన బొమ్మరిల్లు
బొమ్మరిల్లు కమర్షియల్ గా హిట్ కావడమే కాదు అవార్డుల విషయంలో కూడా అదరగొట్టింది. బొమ్మరిల్లు ఏడు నంది అవార్డులు గెలుచుకుంది. చిత్ర నిర్మాత దిల్ రాజు, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, హీరోయిన్ జెనీలియా, నటుడు ప్రకాష్ రాజ్ ఇలా అందరికీ నంది అవార్డులు లభించాయి. కానీ హీరోగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన సిద్దార్థ్ కి మాత్రం ఒక్క అవార్డు కూడా దక్కలేదు. ఇదే విషయాన్ని సిద్దార్థ్ ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ టాలీవుడ్ లో రాజకీయాలని బయటపెట్టారు.
బొమ్మరిల్లు చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమాలో భాగమైన చాలా మందికి నంది అవార్డులు వచ్చాయి. ఒక్కడికి తప్ప.. ఆ అభాగ్యుడిని నేనే అంటూ సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాకు ఎందుకు నంది అవార్డు ఇవ్వలేదో ఎవరైనా సమాధానం చెప్పగలరా ? పోనీ ఆ ఏడాది నాకన్నా బాగా నటించిన నటుడు ఇంకెవరైనా ఉన్నారా ? అంటూ సిద్దార్థ్ టాలీవుడ్ లో జరిగే లాబీయింగ్ లని పరోక్షంగా బయటపెట్టారు.
55
కనీసం గుర్తింపు దక్కలేదు
బొమ్మరిల్లు చిత్రంతో మాత్రమే కాదు నువ్వేస్తానంటే నేనొద్దంటానా సినిమా విషయంలో కూడా తనకి అన్యాయం జరిగింది అని సిద్దార్థ్ ఓపెన్ గా కామెంట్స్ చేశారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మీ అందరికీ ఎంతో బాగా నచ్చిన సినిమా. కమర్షియల్ గా, అన్ని విధాలుగా ఆ సినిమా సక్సెస్ అయింది. ఆ సినిమాకి కూడా చాలా నంది అవార్డులు వచ్చాయి. నాకు మాత్రం రాలేదు. కనీసం ఆ సినిమాలో నటించిన హీరో అనే గుర్తింపు కూడా నాకు దక్కలేదు. నాకు ఎందుకు అవార్డు రాలేదు అనే ప్రశ్నకు అందరికీ సమాధానం తెలుసు. కానీ ఎవ్వరూ చెప్పరు అంటూ సిద్దార్థ్ ఆవేదన వ్యక్తం చేశారు.