అయితే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కూడా శ్రీదేవితో అనుబంధం ఉంది. అశ్విని దత్ తో కలసి అల్లు అరవింద్ ఒకసారి శ్రీదేవి ఇంటికి వెళ్లారట. అప్పటికి శ్రీదేవికి తో పెళ్లి జరిగింది. ఇంటికి వచ్చిన అతిథులకు కాఫీ, టీ ఇవ్వడం సహజమే. దీనితో శ్రీదేవి కాఫీ తీసుకువచ్చి ఇచ్చిందట. శ్రీదేవి అంటే అందరి దృష్టిలో ఒక సూపర్ స్టార్. అల్లు అరవింద్ కూడా ఆమెని సూపర్ స్టార్ లాగే ఆరాధించేవారట.