బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ గెలిచినప్పటికీ ఆ సంతోషం ఎక్కువ సేపు కొనసాగలేదు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన అల్లర్లలో పలు కార్లు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. దీనితో పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అల్లర్లు ఆగలేదు. ఈ అల్లర్లని ఆపడంతో పోలీసులకు ప్రశాంత్ సహకరించలేదనే ఆరోపణతో పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు.