సలార్ నటుడు రవితేజ బంధువా... ఇదేం ట్విస్ట్ సామీ!

Published : Dec 27, 2023, 04:08 PM IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతుంది. కాగా ఈ మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రవితేజ బంధువు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.   

PREV
16
సలార్ నటుడు రవితేజ బంధువా... ఇదేం ట్విస్ట్ సామీ!
Salaar Fame Karthikeya Dev

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల చేశారు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఇక సలార్ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకుంది. టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. 

26

ప్రభాస్ ని ఫ్యాన్స్ కోరుకునే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రజెంట్ చేశాడు. ప్రభాస్ లుక్, యాక్షన్ బ్లాక్స్ గూస్ బంప్స్ కలిగించాయి. ప్రశాంత్ నీల్ కథ మొత్తం పార్ట్ 2 కోసం దాచేశాడు. దీంతో ఎమోషనల్ కనెక్షన్ మిస్ అయ్యింది. 

 

36
Salaar Fame Karthikeya Dev

ఇక సలార్ మూవీకి ఉన్న హైప్ రీత్యా ఈ చిత్రంలో నటించిన చైల్డ్ యాక్టర్స్ పాప్యులర్ అయ్యారు. కాగా సలార్ మూవీలో హీరో రవితేజ బంధువు నటించాడంటూ ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమార్ వరదరాజ మన్నార్ పాత్ర చేశాడు. చిన్నప్పటి వరదరాజ మన్నార్ పాత్రను మాస్టర్ కార్తికేయ దేవ్ చేశాడు. 

46
Salaar Fame Karthikeya Dev

కార్తికేయ దేవ్ రవితేజ బంధువు. ఆయన తమ్ముడు కొడుకు అంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలపై కార్తికేయ దేవ్ స్వయంగా స్పందించాడు. ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. రవితేజ నాకు బంధువు కారు. ఆయన పోలికలు ఉన్నంత మాత్రాన నేను రవితేజ బంధువును అయిపోతానా? 
 

56
Salaar Fame Karthikeya Dev

అడివి శేష్ పోలికలు కూడా ఉన్నాయి అన్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ చిన్నప్పటి పాత్ర చేసినంత మాత్రాన ఆయన బంధువు అయిపోరు కదా. నాకు పరిశ్రమలో ఎవరూ తెలియదు. మా ఫ్యామిలీకి పరిశ్రమతో సంబంధాలు లేవు. పెద్ద సినిమాలో నటించడంతో నాకు  బ్యాగ్రౌండ్ ఉందని అనుకుంటున్నారు. 

 

66
Salaar Fame Karthikeya Dev

నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. ప్రస్తుతం 10వ  తరగతి చదువుతున్నాను. నేను సలార్ మూవీలో నటిస్తున్నాను అంటే మా స్కూల్ లో ఎవరూ నమ్మలేదు, అని కార్తికేయ దేవ్ చెప్పుకొచ్చాడు... 

Read more Photos on
click me!

Recommended Stories