నవీన్ తన బహిరంగ లేఖలో ఈ విధంగా పేర్కొన్నారు. డెవిల్ చిత్రాన్ని తీర్చి దిద్దడానికి నేను మూడేళ్లకు పైగా కష్టపడ్డాను. మొదట కాన్సెప్ట్ ఆ తర్వాత స్క్రిప్ట్, కాస్ట్యూమ్స్ ఎంపిక చేసుకోవడం, లొకేషన్స్, సెట్స్ ఇలా ప్రతి అంశంలో నా ప్రమేయం ఉంది. డెవిల్ చిత్రాన్ని మొత్తం నేను 105 రోజుల పాటు వైజాగ్, కరైకుడి, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ లో చిత్రీకరించాను. కేవలం చిన్న ప్యాచ్ వర్క్ మాత్రం నేను చేయలేదు. డెవిల్ పూర్తిగా నా క్రియేషన్.