`జబర్దస్త్`, రోజాపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు.. ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్.. దుమారమే!

Published : Jan 20, 2021, 04:07 PM IST

`జబర్దస్త్` రోజాపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ ఫైర్‌ అయ్యాడు. సామాజిక బాధ్యతగల పదవుల్లో ఉండి అలా వెకిలి నవ్వులేంటని కామెంట్‌ చేశారు. `జబర్దస్త్` షోలు మానేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడిది పెద్ద దుమారం రేపుతుంది. రోజా అభిమానులు కత్తి మహేష్‌ని ట్రోల్‌ చేస్తున్నారు. 

PREV
110
`జబర్దస్త్`, రోజాపై కత్తి మహేష్‌ అనుచిత వ్యాఖ్యలు.. ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్.. దుమారమే!
నటి రోజా.. హీరోయిన్‌గా సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లారు. ఆమె మొదటి టీడీపీ, ఆ తర్వాత వైఎస్‌ఆర్ సీపీలో చేరారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు `జబర్దస్త్` కామెడీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

210
అయితే సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ పలువురిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌పై విమర్శలు చేసి దెబ్బలు తిన్నారు. ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సునీతపై కూడా విమర్శలు గుప్పించారు. అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రోజాని టార్గెట్‌ చేశాడు.

310
వెకిలి కామెడీ షో `జబర్దస్త్`ని రోజా వదిలేయాలని, అప్పుడే ఆమెకి సరైన గౌరవం దక్కుతుందని ఎద్దేవా చేశాడు. మరి రోజాకి, కత్తి మహేష్‌కి ఎక్కడ చెడిందనేది చూస్తే.

410
నగరి ఎమ్మెల్యే అయిన రోజాకి జగన్‌ మంత్రి వర్గంలో మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ మంత్రి పదవి కాకుండా, ఏపీఐఐసీ చైర్మెన్‌ పదవిని కట్టబెట్టాడు. దీంతో రోజాలో అసంతృప్తి నెలకొందనే ప్రచారం జరిగింది.

510
ఇదే విషయంపై ఇటీవల రోజా.. ఏపీ శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ సమావేశంలో తనని ఎవరూ పట్టించుకోవడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. కలెక్టర్‌ సహా ఎవరూ తనని పట్టించుకోవడం లేదని, నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్‌ విషయంలో అధికారులు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

610
దీనిపై తాజాగా కత్తి మహేష్‌ స్పందించి సెటైర్లు పేల్చాడు. ఆ వెకిలి `జబర్దస్త్` షోని వదిలేస్తే దక్కాల్సిన గౌరవం దక్కుతుందని విమర్శించాడు. హైపర్‌ ఆదిలాంటి వారు అనాధలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే ఖండించాల్సింది పోయి పగలబడి నవ్వుతున్నారని, ప్రజా ప్రతినిధిగా తను ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు అని మండిపడ్డాడు.

710
`రోజా గారు ఎమ్మెల్యేగా ఎన్ని చేసినా... తనకి అప్పగించిన కార్పొరేషన్ విధులు తూచతప్పకుండా నిర్వర్తించినా.. 'జబర్దస్త్' లాంటి వెకిలిషోలో ఇకిలించడం మానకపోతే రావాల్సిన గౌరవం రాదు. దక్కాల్సిన మంత్రిపదవి దక్కదు. ప్రోటోకాల్ కోసం ప్రివిలేజ్ కమిటీకి పోయినా వచ్చేది నిజమైన గౌరవం అయితే కాదుగా.. గౌరవం ఇవ్వమని డిమాండ్ చేయకూడదు.. ఆదేశించాలంతే` అని సలహాలిచ్చారు.

810
అంతేకాదు ఇటీవల తాను ఎమ్మెల్యే కావడానికి `జబర్దస్త్` షోనే కారణమని రోజా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీనిపై పంచ్‌ వేస్తూ మరి నగరి నియోజకవర్గ ప్రజలు ఏం చేశారు, వారి పరిస్థితేంటి? అని విమర్శించాడు.

910
కత్తి మహేష్‌ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. రోజా అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి, తాను చేసే వృత్తికి సంబంధమేంటని ప్రశ్నించారు. కత్తి మహేష్‌ని సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు తగ్గించుకుంటే మంచిదని, లేదంటే గత పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని మండిపడుతున్నారు.

1010
ఇతరుల వ్యక్తిగత విషయాల్లో దూరాల్సిన అవసరం ఏంటి? అని, ఫస్ట్ నీ పని నువ్వు చూసుకో అంటూ మండిపడుతున్నారు. కత్తి మహేష్‌ని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు రోజా ఫ్యాన్స్.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories