వారణాసి వెళ్లి సన్యాసినిగా మారిన రేణూ దేశాయ్... ఫోటోలు చూసి షాకవుతున్న ఫ్యాన్స్!

First Published Jan 20, 2021, 3:25 PM IST

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కొత్త అవతారం ఆమె అభిమానులను సందిగ్ధంలోకి నెట్టింది. జట్టు విరబోసుకుని, నుదుటున అడ్డ నామాలు, ఎర్రని బొట్టు పెట్టుకొని ఆమె సన్యాసిని గెటప్ లో కనిపించారు.

మిత్రులతో కలిసి వారణాసి దర్శించుకున్న రేణూ దేశాయ్ శివ భక్తురాలిగా మారిపోయింది. గతంలో ఎన్నడూ చూడని రూపంలో కనిపించి అందరినీ షాక్ కి గురి చేసింది.  రేణూ వారణాసి ట్రిప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
undefined
మతత్త్వం కాదు, ఆధ్యాత్మికంగా ఉండాలి. దాని భేదం ఏమిటో తెలుసుకోండి అని తన ఫొటోకు రేణూ కామెంట్ పెట్టారు.
undefined
బద్రి మూవీతో హీరోయిన్ గా మారిన రేణూ దేశాయ్, పవన్ కళ్యాణ్ తో సహజీవనం చేశారు. వీరికి సంతానం కలిగిన తరువాత అధికారికంగా వివాహం చేసుకోవడం జరిగింది.
undefined
కాగా 2012లో పవన్ కళ్యాణ్-రేణూ దేశాయ్ విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి అఖీరా, ఆద్య  అనే అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఇద్దరు పిల్లలు రేణూ సంరక్షణలోనే పెరుగుతున్నారు.
undefined
జానీ మూవీ తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పిన రేణూ దేశాయ్... తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. రేణూ ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.
undefined
అలాగే దర్శకత్వం చేసే అలోచనలో కూడా రేణూ దేశాయ్ ఉన్నారు. రేణూ దేశాయ్ రైతుల సమస్యలపై ఓ మూవీ చేయనున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
undefined
రేణూ దేశాయ్ ప్రస్తుతం తన మకాం హైదరాబాద్ కి మకాం మార్చారు. గతంలో ఆమె పూణేలో ఉండేవారు. ఓ వ్యక్తితో రేణూ నిశ్చితార్ధం జరుగగా... ఎందుకో ఆ పెళ్ళి జరుగలేదు.
undefined
click me!