మరోవైపు విక్ట్రినా పెళ్లికి హాజరయ్యే బాలీవుడ్ ప్రముఖల జాబితాలో కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, రణ్‌బీర్ కపూర్ పేర్లు ఉన్నాయా? లేవా? అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది. కానీ తమకు ఆహ్వానం అందలేదని సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. అలాగే విక్కీ మాజీ ప్రేయసి హర్లీన్ సేథీని కూడా ఆహ్వానించలేదని భోగట్టా. వివాహానికి వెళ్లే అతిథుల్లో ఆలియా భట్, కరణ్ జోహార్, కబీర్ ఖాన్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, వరుణ్ ధావన్‌వంటి ప్రముఖులు హాజరు కానున్నారట.