కత్రినా, విక్కీ కౌశల్ ల వివాహానికి కొందరు బాలీవుడ్ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటగా విక్కీ కౌశల్ , కత్రినా వివాహానికి హాజరు కానున్నారు. ఇక కత్రినా వివాహానికి కోవిడ్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ భయం పట్టుకుంది. దీనితో కోవిడ్ ని దృష్టిలో పెట్టుకుని కత్రినా, విక్కీ కౌశల్ గెస్ట్ ల సంఖ్యని తగ్గించుకుంటున్నట్లు తెలుస్తోంది.