మెలోడీ బ్రహ్మ మణిశర్మ గురించి తెలియని వారుండరు. దశాబ్దాల కాలంగా టాలీవుడ్ లో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడు కాస్త జోరు తగ్గినప్పటికీ రేసులో నుంచి వైదొలగలేదు. అప్పుడప్పుడూ తన మార్క్ ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరికీ ఆయనే ఫేవరిట్ మ్యూజిక్ డైరెక్టర్. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్, పవన్ లకు మణిశర్మ ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించారు.