`ఆర్ ఎక్స్ 100` చిత్రంతో ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయాడు కార్తికేయ. ఈ సినిమా అనూహ్యమైన సక్సెస్ ఆయనకు మంచి ఇమేజ్‌ని గుర్తింపుని తీసుకొచ్చింది. ఆ తర్వాత కార్తికేయ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. విమర్శలకు మెప్పించినా కమర్షియల్‌గా సత్తాచాటలేకపోయాయి. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో `రాజా విక్రమార్క` చిత్రంలో నటించాడు. శ్రీ సరిపల్లి అనే నూతన దర్శకుడు రూపొందించిన చిత్రం నేడు(నవంబర్ 12న) శుక్రవారం విడుదలైంది. ఇందులో సుధాకర్ కోమాకుల, సాయికుమార్ కీలక పాత్రలు పోషించారు. తాన్య రవిచంద్రన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాని గత రాత్రినుంచే యూఎస్‌లో ప్రదర్శిస్తున్నారు. మరి అక్కడి ప్రీమియర్స్ రివ్యూ(Raja Vikramarka US Premier Show review) ఎలా ఉండో చూద్దాం.
`రాజా విక్రమార్క`(Raja Vikramarka) మూవీ కార్తికేయ(Kartikeya), ఆయన ముగ్గురు ఎన్‌ఐఏ ఉద్యోగులతో స్టార్ట్ అవుతుందట. ఈ ఎన్‌ఐఏ బ్యాచ్‌కి తనికెళ్ల భరణి హెడ్. టాస్క్ లో భాగంగా హీరో అతని ఎన్‌ఐఏ టీమ్ ఓ సంఘ విద్రోహిని పట్టుకుని చంపేస్తారు. హీరో కార్తికేయ ఎంట్రీ చాలా బాగుంది. ఆ తర్వాత హోమంత్రిగా సాయికుమార్ ఎంట్రీ ఇస్తాడు. కిడ్నాపర్స్ నుంచి హోంమంత్రిని రక్షించడమనే మిషన్‌ని హీరో కార్తికేయ టీమ్ చేపడతారు. ఇందులో భాగంగా వీరంతా సీక్రెట్ ఆపరేషన్ చేపడతారు. వాళ్లు ఎన్ఐఏ ఆఫీసర్స్ అని ఎవరికీ తెలియకుండా తమ ఐడెంటీలను మార్చుకుంటారు.
కట్ చేస్తే హోమంత్రి కూతురే హీరోయిన్ తాన్య రవిచంద్రన్ (Tanya Ravichandran). వెంటనే హీరోహీరోయిన్ల మధ్య ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయేలా ఉందట. ఆపరేషన్‌గా భాగంగా హీరోయిన్కి డాన్స్ నేర్పించే మాస్టర్‌కి అసిస్టెంట్‌గా కార్తికేయ హోంమంత్రి ఇంటికి వెళ్తాడట. అక్కడ హీరో, హీరోయిన్ల మధ్య చిట్‌చాట్‌లో, డేటింగ్ దారితీస్తుంటాయి. గ్యాప్ లేకుండానే హీరో ప్రేమలో పడుతుందట హీరోయిన్. ఆయనకు కనెక్ట్ అవ్వడంతోనే ఫస్ట్ సాంగ్
వచ్చేస్తుందట.
పోలీస్ అధికారిగా సుధాకర్ కోమాకుల కనిపిస్తాడు. ఆయన కూడా హోంమంత్రిని సేవ్ చేసే మిషన్ కోసం హీరోతో కలిసి పనిచేయాల్సి వస్తుందట. ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హోంమినిస్టర్ సాయికుమార్‌ని కిడ్నాప్ చేసే ప్రయత్నం జరగ్గా దాన్ని ఎన్‌ఐఏ అధికారి కార్తికేయ అండ్‌టీమ్ సేవ్ చేస్తుందట. దీంతో వీళ్లు ఎన్‌ఐఏ టీమ్ అని హోం మినిస్టర్ ఆ సమయంలో తెలుస్తుందట.
ఇక్కడే పెద్ద ట్వీస్ట్ ఉంటుందట. హోంమంత్రికి బదులు ఆయన కూతురు(హీరోయిన్) కిడ్నాప్‌కి గురవుతుందట. హీరో టీమ్‌కిది షాకింగ్ విషయం. ఆడియెన్స్ కి ట్విస్ట్. దీంతో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది. ఫస్టాఫ్ వరకు హీరో కార్తికేయ నటన చాలా బాగుందట. చాలా మెచ్యూర్డ్ గా, సెటిల్డ్ గా నటించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు సినిమా కూల్‌గా సాగినట్టు తెలుస్తుంది.
ఇంటర్వెల్ తర్వాత ఎన్‌ఐఏ, పోలీసులకు, కిడ్నాపర్లకి మధ్య డిస్కషన్స్, ఛేజింగ్, ఛాలెంజెస్ వంటి తీవ్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. ఇంతలో మరో ట్విస్ట్ .. హీరో అనుకోకుండా హోంమంత్రిని కాల్చేస్తాడు. అదే సమయంలో కిడ్నాపర్‌ని చంపేస్తాడు. అయినా హీరోయిన్‌ని కిడ్నాపర్ల నుంచి విడిపించలేకపోతారు. ఆమె కిడ్నాపర్ల చెరలోనే ఉంటుందట.
ఇక సినిమాలో వేగం పెరిగింది. కిడ్నాపర్లు డబ్బు డిమాండ్ చేస్తారు. వాళ్లకి డబ్బు ఇచ్చే ప్రాసెస్‌లో హీరోయిన్ మార్పిడి జరుగుతుందట. చివరికి ఉత్కంఠంగా సాగిన క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ తో హీరోయిన్‌ని.. ఎన్‌ఐఏ అధికారి అయిన కార్తికేయ రక్షిస్తాడు. దీంతో సినిమా ముగుస్తుందని యూఎస్ ప్రీమియర్స్ షో టాక్ చెబుతుంది. కార్తికేయ నటన ఆకట్టుకుంటుందని, హీరోయిన్ తాన్య తన పాత్ర మేరకు అలరిస్తుందట. సుధాకర్ కోమాకుల మరో కొత్త పాత్రలో కనిపిస్తాడట. తమిళ నటుడు పశుపతి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఓవరాల్‌గా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి సినిమా పూర్తి స్థాయిలో ఎలా ఉంది, తెలుగు ఆడియెన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారనేది తెలియాలంటే పూర్తి `ఏషియానెట్` రివ్యూ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.