రాజా సాబ్ కోసం ప్రభాస్‌ రెమ్యూనరేషన్ ఎంత? 6 స్టార్స్ లో ఎవరు ఎక్కువ తీసుకున్నారంటే?

Published : Nov 22, 2025, 09:08 PM IST

సౌత్ సూపర్ స్టార్ ప్రభాస్ హారర్ కామెడీ సినిమా 'ది రాజా సాబ్' త్వరలో ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయబోతోంది.  ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా? ప్రభాస్ తో పాటు 6 స్టార్స్  పారితోషికం ఎంత ?

PREV
17
ప్రభాస్ రెమ్యునరేషన్

 ప్రభాస్  హీరోగా నటించిన సినిమా 'ది రాజా సాబ్' . ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈక్రమంలో  ప్రభాస్ రాజాసాబ్ కోసం  ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడన్నడో  తెలుసా?  మీడియా కథనాల ప్రకారం,  ప్రభాస్‌కు రాజాసాబ్ కోసం నిర్మాతలు రూ.100 కోట్లు ఇచ్చినట్టు సమాచారం.

27
సంజయ్ దత్

'ది రాజా సాబ్' సినిమాలో సంజయ్ దత్ ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. ఈ సినిమా కోసం సంజయ్ దత్‌కు 5 నుంచి 6 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటించారు. 

37
నిధి అగర్వాల్

'ది రాజా సాబ్' సినిమాలో  ప్రభాస్ జోడీగా నటించింది  నిధి అగర్వాల్‌. ఈసినిమాలో ఏంజల్ లుక్ లో మెరిసిపోబోతోంది. ఈసినిమా కోసం నిథి దాదాపు 1.2-1.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. 

47
మాళవిక మోహనన్

'ది రాజా సాబ్' సినిమాలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమా కోసం ఆమె 2 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

57
అనుపమ్ ఖేర్

రాజాసాబ్ లో బాలీవుడ్ స్టార్ నటుడు   అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో నటించినందుకు ఆయనకు రూ.1 కోటి పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. 

67
బ్రహ్మానందం

దక్షిణాది సినిమాల్లో స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన బ్రహ్మానందం.. ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించారు. గెస్ట్ రోల్స్ కే పరిమితం అవుతున్నాడు. రాజాసాబ్ లో బ్రహ్మీ సందడి చేయబోతున్నారు.  బ్రహ్మానందం 'ది రాజా సాబ్' సినిమా కోసం 80 లక్షలు తీసుకుంటున్నట్టు సమాచారం. 

77
యోగి బాబు

సౌత్ లో చాలా తక్కువ టైమ్ లో కమెడియన్ గా ఎదిగాడు యోగి బాబు.  'ది రాజా సాబ్' సినిమా లో కామెడీ తో మెరుపులు మెరిపించబోతున్నాడు. ఈ సినిమా కోసం  యోగిబాబు 60 లక్షల వరకూ ఛార్జ్ చేసినట్టు సమాచారం. 

Read more Photos on
click me!

Recommended Stories