Japan Premier Review : ‘జపాన్’ ప్రీమియర్ రివ్యూ.. కార్తీ 25వ చిత్రం ఎలా ఉందంటే?

First Published | Nov 10, 2023, 7:28 AM IST

హీరో కార్తీ ‘జపాన్’ మూవీ ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే యూఎస్ఏలో ప్రీమియర్స్ షోలు పడ్డాయి. ఈ సందర్భంగా సినిమా ఎలా ఉందనే విషయాలను ప్రీమియర్ రివ్యూ లో తెలుసుకుందాం.
 

తమిళ స్టార్ కార్తీ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘జపాన్’ (Japan). ఇది ఆయన 25వ సినిమా కావడం విశేషం. రైటర్ గా, డైరెక్టర్ గా తమిళనాట మంచి గుర్తింపు దక్కించుకున్న రాజు మురుగున్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎప్పటి లాగే ఈ మూవీకి విభిన్నమైన కథను అందించారు. అను ఇమ్మాన్యూయేల్ హీరోయిన్ గా నటించింది.
 
 

ఈరోజు (నవంబర్ 10)  చిత్రం ఇండియాలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. అంతకంటే ముందే యూఎస్ఏలో ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసిన కార్తీ ఈ చిత్రంతో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటాడని ప్రీమియర్ షో ప్రకారం తెలుస్తోంది.
 


గోల్డ్ పిచ్చి ఉన్న పాత్రలో కార్తీ నటించిన చిత్రమే ‘జపాన్’. చిత్రంలో కార్తీ డిఫరెంట్ వాక్ స్టైల్, వాయిస్, హెయిర్, బాడీ లాంగ్వేజీతో అదరగొట్టారంట. ఆయన కెరీర్ లోనే బెస్ట్ ఫెర్ఫామెన్స్ ఇచ్చారని అంటున్నారు. ప్రయోగాలు చేస్తూ ఫలితం అందుకోవడం ఆయన ముందుటారని మళ్లీ నిరూపించారంటున్నారు. కారీ పెర్ఫామెన్స్ సినిమా మొత్తం కేక పుట్టించేలా ఉంటుందంట.

రాజు మురుగన్ అందించిన కథ, డైరెక్షన్ అదిరిపోయిందంటున్నారు. కార్తీ దొంగతనాలు చేసే తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడం పక్కా అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ అనే రెస్పాన్స్ దక్కించుకుంది ఈ చిత్రం. దొంగతనాలు, యాక్షన్ తో సాగిపోతోంది.
 

ఇంటర్వెల్ ముందు ప్లాన్ చేసిన ఓ రాబరీ ది బెస్ట్ అనిపిస్తుందని తెలుపుతున్నారు. ఒక జ్యువెలరీ షాపులో 200 కోట్ల విలువైన జ్యూయెల్లరీని దొంగిలిస్తాడు. దాంతో పోలీసులు జపాన్ ను పట్టుకునేందుకు ఏం చేశారనేది సినిమా. ఛేజింగ్ సీన్లు సూపర్. కార్తీ అవుట్ అండ్ అవుట్ పెర్ఫామెన్స్ తో దుమ్ములేపారంట. యాక్షన్ సీక్వెన్స్ లతోనూ అదరగొట్టారంటారు. ప్రతి సీన్ చాలా ఫ్రెష్ గా, కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. 
 

సెకండ్ హాఫ్ లో మరింత యాక్షన్ తో అదరగొట్టారని తెలుస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కామెడీ ఎలమెంట్స్  కూడా అలరించేలా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్  అంశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని తెలుస్తోంది. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం మరింత సినిమాకు ప్లస్ అయ్యిందని, పాటలూ కూడా పర్లేదనే అంటున్నారు. మొత్తానికి కార్తీ 25వ చిత్రానికి యూఎస్ఏ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఇక్కడ కూడా ఎర్లీ షోలు స్టార్ట్ అయ్యాయి. తమిళం, తెలుగులో ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి. మరికాసేపట్లో పూర్తి రివ్యూ రానుంది. ఈ చిత్రాన్ని  

Latest Videos

click me!