Karthikeya 2 Review: `కార్తికేయ 2` ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్‌ రోరింగ్‌

Published : Aug 13, 2022, 06:01 AM ISTUpdated : Aug 13, 2022, 06:42 AM IST

సూపర్‌ హిట్‌ ఫిల్మ్ `కార్తికేయ` సినిమాకి సీక్వెల్‌గా నిఖిల్‌ హీరోగా, అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చందూ మొండేటి రూపొందించిన చిత్రం `కార్తికేయ 2`. ఇది నేడు(ఆగస్ట్ 13)న విడుదలవుతుంది. సినిమాకి ట్విట్టర్‌ ద్వారా వస్తోన్న స్పందన ఎలా ఉందో ట్విట్టర్‌ టాక్‌లో తెలుసుకుందాం.

PREV
17
Karthikeya 2 Review: `కార్తికేయ 2` ట్విట్టర్ రివ్యూ.. నిఖిల్‌ రోరింగ్‌

యంగ్‌ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరోగా నిలబడ్డారు. అనేక ఆటుపోట్ల నేపథ్యంలో ఆయన `స్వామిరారా`, `కార్తికేయ` వంటి బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో యంగ్‌ హీరోగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని దక్కించుకున్నారు. వరుస పరాజయాల అనంతరం చివరగా `అర్జున్‌ సురవరం`తో డీసెంట్‌ హిట్‌ని అందుకున్న నిఖిల్‌ ఇప్పుడు `కార్తికేయ 2`తో వచ్చారు.

27

 మొదటి భాగానికి కొనసాగింపుగా, సూపర్‌నేచురల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన `కార్తికేయ 2`కి చందూమొండేటి దర్శకత్వం వహించారు. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం నేడు(ఆగస్ట్ 13)న విడుదల అవుతుంది. యూఎస్‌లో సినిమాకి ప్రీమియర్స్ పడ్డాయి. సినిమా చూసిన ఆడియెన్స్ ట్విట్టర్‌ ద్వారా పోస్ట్ లు పెట్టారు. మరి ట్విట్టర్‌ రివ్యూ(Karthikeya2 Twitter Review) ఎలా ఉందనేది తెలుసుకుందాం.  

37

ఎపిక్‌ మిస్టికల్‌ అడ్వెంచర్‌ జర్నీగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు చందూ మొండేటి. ఇందులో నిఖిల్‌ డాక్టర్‌ కార్తికేయగా నటించారు. ఆయన వైద్యుడు. మరి ఆయన డిటెక్టివ్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది. అలా మారి ఆయన కనుకొన్న మిస్టరీ ఏంటనేది ఈ సినిమా ప్రధాన కథ. ట్విట్టర్‌ పోస్ట్ ల ప్రకారం సినిమాకి పాజిటివ్‌ టాక్‌ వస్తుంది. మొదటి భాగంతో పోల్చితే సినిమా చాలా బాగుందంటున్నారు.  Karthikeya2 Twitter Review

47

ఫస్టాఫ్‌ డీసెంట్‌గా ఉందట. స్క్రీన్‌ ప్లే చాలా బాగుందని అంటున్నారు. కథ, స్క్రీన్‌ప్లే ఆడియెన్స్ ని కట్టిపడేసేలా ఉందని, సెకండాఫ్‌లో బీజీఎం, దర్శకుడి టేకింగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయంటున్నారు. మొదటి భాగం కాస్త స్లోగా స్టార్ట్ అయినా క్రమంగా పుంజుకుంటుందట. కథ చెప్పిన విధానం చాలా ఆసక్తికరంగా ఉందటున్నారు. సినిమా చాలా హై నోట్‌తో ముగుస్తుందట.  Karthikeya2 Twitter Review

57

నిఖిల్‌ లుక్‌ బాగుందని, బీజీఎం, సినిమాటోగ్రఫీ ఆహ్లాదకరంగా ఉన్నాయట.కొన్ని సీన్లలో సెకండాఫ్‌లో గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉందని చెబుతున్నారు. ఓవరాల్‌గా సంతృప్తినిచ్చే మైథలాజికల్‌ రైడ్‌లా ఉందని, మొదటి భాగం కంటే బిగ్గర్‌గా, బెట్టర్‌గా, నెరేషన్‌ చాలా ఫోకస్‌గా ఉందట. కథ చాలా ఫ్రెష్‌గా ఉందని అంటున్నారు. దర్శకుడు చందూ మొండేటి సినిమా ఆసాంతం టెంపో బాగా మెయింటేన్‌ చేశాడట. అక్కడక్కడ మెస్మరైజ్‌ చేసే సన్నివేశాలున్నాయట.  Karthikeya2 Twitter Talk.

67

దర్శకుడు టేకింగ్‌ సూపర్బ్ గా ఉందని, హీరో నిఖిల్‌ చాలా బాగా చేశాడని, అతని నటనలో మెచ్యూరిటీ కనిపిస్తుందని ట్వీట్లు చేస్తున్నారు చూసిన ఆడియెన్స్. స్క్రీన్‌ ప్లే,విజువల్స్ వండర్‌గా అనిపిస్తున్నాయట. సినిమా మొత్తం ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా సాగుతుందట. ఎక్కడ ల్యాగ్‌ లేదని చెబుతున్నారు. ఈ సినిమాతో నిఖిల్‌ గట్టి హిట్‌ కొట్టారని,  ఏకంగా 3 రేటింగ్‌ ఇస్తున్నారు.అంతేకాదు అందరి నుంచి పాజిటివ్ పోస్ట్ లు రావడం విశేషం. 

77

ఎక్స్ లెంట్‌ ఫస్టాఫ్‌, గుడ్‌ స్క్రీన్‌ ప్లే, సినిమాటోగ్రఫీ, ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్, క్లైమాక్స్, నిఖిల్‌, అనుపమా పరమేశ్వరన్‌ నటన సినిమాకి హైలైట్‌గా చెబుతున్నారు. కచ్చితంగా చూడాల్సిన సినిమా అని నెటిజన్లు ట్వీట్లల్లో మెన్షన్‌ చేయడం విశేషం.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories