`జబర్దస్త్` కమెడియన్ సుడిగాలి సుధీర్, రష్మి మధ్య లవ్ స్టోరీ అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు వారి మధ్య గ్యాప్ వచ్చింది. కానీ సుధీర్ మరో నటితో తిరగడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), యాంకర్ రష్మి గౌతమ్(Rashmi Gautam) లవ్ స్టోరీ కొన్నేళ్లుగా హాట్ టాపిక్. `జబర్దస్త్`(Jabardasth)లో వీరిద్దరి కెమిస్ట్రీ పీక్‌లోకి ఉండేది. ఈ ఇద్దరు కలిసి డ్యూయెట్లు పాడితే షో టీఆర్‌పీ ఆమాంతం పెరిగిపోయేది. వీరి మధ్య వచ్చే సన్నివేశాలు, లవ్ ప్రపోజల్స్, రొమాంటిక్ పాటలు ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇద్దరు తమ బాండ్ చాలా స్పెషల్ అని చెప్పుకుంటూ వచ్చారు.
26
అయితే ఉన్నట్టుంది ఇటీవల వీరి మధ్య గ్యాప్ వచ్చింది. ఇద్దరు కలిసి చేసిన `జబర్దస్త్` షో నుంచి, `ఢీ` నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. `జబర్దస్త్`తోనైనా మొన్నటి వరకు మెప్పించిన ఈ జంట ఇప్పుడు దాన్నుంచి కూడా దూరయ్యారు. `జబర్దస్త్` ని సుడిగాలిసుధీర్ వదిలేసిన విషయం తెలిసిందే. సినిమా అవకాశాల నేపథ్యంలో ఆయన ఈషో నుంచి తప్పుకున్నారు. దీంతో ఇద్దరు ఓ రకంగా విడిపోయిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఎక్కడ ఉన్నా మా మనసులు కలిసే ఉంటాయని రష్మి చెప్పడం హైలైట్‌గా నిలిచింది.
36
ఇప్పుడు సుడిగాలి సుధీర్ చేస్తున్న పనులు చూస్తుంటే అందరిని ఆశ్చర్య పరుస్తుంది. రష్మిని దూరం పెట్టిన సుడిగాలి సుధీర్ ఇప్పుడు మరో నటితో చెట్టాపట్టాలేసుకుని తిరుగడం హాట్ టాపిక్ అవుతుంది. ప్రస్తుతం సుధీర్.. `ఢీ` యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli)తో కలిసి తిరుగుతున్నారు. ఈ ఇద్దరు ఇటీవల తరచూ కలిసే వెళ్తుండటం విశేషం. అయితే ఇదంతా వారిద్దరు కలిసి నటించిన సినిమా కోసం అనేది అందరికి తెలిసిందే.
46
సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి కలిసి జంటగా `వాంటెడ్ పండుగాడ్` అనే చిత్రంలో నటించారు. అనసూయ, విష్ణు ప్రియా, సునీల్ వంటి కమెడియన్లు కలిసి నటించిన చిత్రమిది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 19న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్, దీపికా పిల్లి ప్రధానంగా చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు.
56
దీంతో నెటిజన్లు సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. రష్మిని వదిలేసిన సుడిగాలి సుధీర్, హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. పాపం రష్మి పరిస్థితేంటో అని కామెంట్ చేస్తున్నారు. దీనిపై లేనిపోని రచ్చ చేస్తుండటం గమనార్హం.
66
ఇదిలా ఉంటే `జబర్దస్త్`ని వీడిన సుధీర్.. స్టార్ మాలో `సూపర్ సింగర్ జూనియర్స్` షోకి హోస్ట్ గా చేస్తున్నారు. అనసూయతో కలిసి ఆయన రచ్చ చేస్తుంది. మరోవైపు హీరోగా వరుసగా సినిమాలున్నాయి. `వాంటెడ్ పండుగాడ్`తోపాటు `గాలోడు`, `కాలింగ్ సహస్ర` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి విడుదలకు సిద్ధమవుతున్నాయి.