మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకున్న ‘కార్తికేయ 2’.. థియేటర్ల సంఖ్యా పెరుగుతోంది..

First Published Aug 16, 2022, 3:11 PM IST

యంగ్ హీరో నిఖిల్ నటించిన మైథలాజికల్ ఫిల్మ్ ‘కార్తికేయ 2’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రోజురోజుకు వసూళ్లు పెంచుతూ పోతుండగా.. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసుకోవడం విశేషం.
 

‘కార్తికేయ 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో నిఖిల్ కు ప్రేక్షకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకొని థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. అటు బాక్సాఫీస్ వద్ద కూడా రోజురోజుకు వసూళ్లను పెంచుకుంటూ పోతోంది. తాజాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను  పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు పెద్దగా హైప్ క్రియేట్ చేయని ఈ చిత్రం తొలిరోజు థియేటర్ల పర్లేదు అనిపించింది. కానీ ఈ వారంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాకపోనుండటంతో ప్రేక్షకుల పోకస్ మొత్తం ‘కార్తికేయ 2’పైనే ఉంది. వీకెండ్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లలో  హౌజ్ ఫుల్ తో రన్ అవుతోంది. వరుసగా మూడు రోజులు ఇదే పరిస్థితి నెలకొంది.

చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంటోందీ చిత్రం. ఇటు బాక్సాఫీస్ వద్ద కూడా కార్తికేయ 2 తన సత్తా చూపిస్తోంది. కేవలం మూడురోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.15.44 కోట్ల షేర్ ను (రూ.26.50 కోట్ల గ్రాస్) వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ నే రాబట్టింది. రూ.11.54 కోట్ల షేర్ (రూ.17.80) కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. 

అయితే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.13.30  కోట్ల షేర్స్ గా ఉంది.  అయితే ఈ మొత్తాన్ని ‘కార్తికేయ 2’ మూవీ కేవలం మూడు రోజుల్లోనే పూర్తి చేసింది. బ్రేక్ ఈవెన్ కు మించిన వసూళ్లను రాబట్టడంతో బయ్యర్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

తొలిరోజే మంచి టాక్ రావడంతో సినిమాను మరిన్ని థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా థియేటర్ల సంఖ్యనూ పెంచుతున్నారు. మూడు రోజులుగా ఎక్కడ చూసిన హౌజ్ ఫుల్ బోర్డ్స్ తో ‘కార్తికేయ 2’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటికే యూఎస్ఏలోనూ 1000కిపైగా షో అమ్ముడుపోయాయి.    

మూవీలో యంగ్ హీరో నిఖిల్ - అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించారు. ‘కార్తికేయ’కు సీక్వెల్ గా వచ్చిన ‘కార్తికేయ 2’కు కూడా  చందూ మొండేటి దర్శకత్వం వహించారు.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. విజువల్ వండర్స్ గా రూపొందిన మూవీకి ప్రేక్షకల నుంచి బ్రహ్మండమైన స్పందన లభిస్తోంది.
 

click me!