Karthika Deepam 2 Today Episode:కాంచనకు ఒట్టేసిన దీప, కార్తీక్-జ్యోకు షాకిచ్చిన సూరజ్-సుమిత్ర కంగారు

Published : May 07, 2026, 09:06 AM IST

Karthika Deepam 2 Today Episode (మే 7వ తేదీ)లో సూరజ్ ని దెబ్బ కొట్టాలి అనుకున్న జ్యో. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సూరజ్. నెల రోజుల తర్వాత శివన్నారాయణ ఇంటికి వెళ్లమని కాంచనకు దీప, కార్తీక్. సుమిత్ర కంగారు. ఈ రోజు ఇంకా ఏం జరిగిందంటే...  

PREV
18
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో క్యాబ్ బుక్ కాలేదనే చిరాకులో ఉంటాడు సూరజ్. అప్పుడే అటువైపుగా వెళ్తున్న జ్యోత్స్న.. సూరజ్ ని చూసి ఆగుతుంది. ఆ రోజు షాప్ లో నాతో గొడవ పెట్టుకున్నాడు. వీడి ఈగో మీద దెబ్బ కొట్టాలని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. సూరజ్ దగ్గరకు వెళ్లి.. ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నారా అని అడుగుతుంది. లేదు అర్జెంట్ గా ఇంటికి వెళ్లాలి.. అని తన సిచువేషన్ చెప్తాడు సూరజ్. సరే నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటుంది జ్యోత్స్న. వద్దు అంటాడు సూరజ్. డబ్బులు తీసుకుంటా అంటేనే వస్తానని చెప్తాడు సూరజ్. సరే అని కారు ఎక్కించుకుంటుంది జ్యోత్స్న.

28
విడుదల ఎప్పుడు?

మరోవైపు శ్రీధర్, కాంచన మాట్లాడుకుంటూ ఉండగా, కార్తీక్, దీప వస్తారు. నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా మాస్టారు అంటాడు కార్తీక్. నాకే కాదు అందరికీ విశ్రాంతి అవసరం అంటాడు శ్రీధర్. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అంటే నీ అగ్రిమెంట్ కు ఇంకా నెల రోజులే మిగిలింది. ఆ తర్వాత నీకు విడుదలే కదా... మరి నీ భార్యకు విడుదల ఎప్పుడు? అని కార్తీక్ ని అడుగుతుంది కాంచన. దీప ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంటని శ్రీధర్ కూడా అడుగుతాడు. మన ఫ్యామిలీ కోసం అని చెప్తాడు కార్తీక్. వాళ్లు ఏం చేసుకుంటే మనకేంటి? మీరెందుకు ఇన్ని మాటలు పడాలి. ఇంత ఇబ్బంది పడాలి అని గట్టిగానే అడుగుతుంది కాంచన. ఇదంతా మన కుటుంబం అమ్మా అంటాడు కార్తీక్.

38
ఒట్టు వేసిన దీప, కార్తీక్

మీరు మాకు అన్ని విషయాలు చెప్పరు కదా అన్నట్లు మాట్లాడుతుంది కాంచన. మీ దగ్గర ఏం దాచట్లేదని చెప్పాలంటే ఏం చేయాలని అడుగుతుంది దీప. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి అయినా, కాకపోయినా ఆ ఇంటికి వెళ్లమని ఒట్టు వేయాలంటాడు శ్రీధర్. కార్తీక్, దీప షాక్ అవుతారు. మీ నాన్న చెప్పారు కానీ, నా మనసులోని మాట కూడా అదే అంటుంది కాంచన. దీప ఒట్టు వేసి, కార్తీక్ తో కూడా వేయిస్తుంది. ఇప్పుడు హ్యాపీగా ఇంటికి వెళ్తాను అంటాడు శ్రీధర్.

48
జ్యోకు షాకిచ్చిన సూరజ్

మరోవైపు జ్యోత్స్నకు థ్యాంక్స్ చెప్తాడు సూరజ్. ఆ తర్వాత ఒకరికొకరు పరిచయం చేసుకుంటారు. వీడి పొగరు ఎలాగైనా దించుతానని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. కారు వెళ్లే రూట్ చూసి ఈ దారిలో మణికొండ ఎలా వెళ్తారని అడుగుతాడు సూరజ్. అయ్యో మీరు మణికొండ వెళ్లాలా.. సారీ అండీ, నాకు ఎల్బీ నగర్ అన్నట్లు వినపడితే డ్రాప్ చేస్తానన్నాను అంటూ కారు ఆపుతుంది జ్యోత్స్న.

నో ప్రాబ్లం.. నన్ను మెయిన్ రోడ్డు వరకు డ్రాప్ చేయండని అడుగుతాడు సూరజ్. నేను రాలేను నడుచుకుంటూ వెళ్లండి అని చెప్తుంది జ్యోత్స్న. కొందరికి మాటల కంటే చేతలే మంచి గుణపాఠం నేర్పిస్తాయని నడుచుకుంటూ వెళ్లిపోతాడు సూరజ్. నవ్వుకుంటూ జ్యో కారు స్టార్ట్ చేయబోతుంది. కారు కీస్, ఫోన్ మిస్ అవుతాయి. దాంతో సూరజ్ కోసం వెతుకుతుంది. ఏం దెబ్బ కొట్టావ్ రా నన్నే ఫూల్ ని చేశావు అని నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది.

58
దీప డౌట్..

మరోవైపు అమ్మకు ఎందుకు మాటిచ్చావని దీపను అడుగుతాడు కార్తీక్. నా తల్లి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నేను అత్త కోసం ఆలోచించనా బావ? అని అంటుంది దీప. నెల రోజుల్లో జ్యోత్స్న పెళ్లి జరుగుంది కానీ.. ఎవరితో జరుగుతుందో తెలియదు అంటుంది దీప. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకున్నట్లే, ఏదో ఒకటి చేసి మూడు ముళ్లు కూడా వేయించుకుంటుంది అంటుంది దీప. నేనేమైనా చిన్న పిల్లాడినా? తను ఏం చెప్తే అది చేయడానికి అంటాడు కార్తీక్. జ్యోత్స్నకు తనకు తగిన వ్యక్తి ఎక్కడో ఉండే ఉంటాడు. త్వరలో వెతుక్కుంటూ వస్తాడు అంటాడు కార్తీక్.

68
రూ. 10 వేలు ఇస్తా..

మరోవైపు సూరజ్ ని తిట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటుంది జ్యోత్స్న. అప్పుడే ఒక ఆటో వస్తుంది. డ్రైవర్ కి అడ్రస్ చెప్పి డ్రాప్ చేయమని అడుగుతుంది. నేను చేస్తాను కానీ.. ఆ సార్ ఒప్పుకుంటేనే చేస్తాను అంటాడు డ్రైవర్. ఏ సారు అని ఆటోలోకి చూస్తుంది జ్యోత్స్న. సూరజ్ స్టైల్ గా కూర్చొని ఉంటాడు. డ్రైవర్ వీడిని దించేయ్, నన్ను డ్రాప్ చేస్తే రూ.10 వేలు ఇస్తానని చెప్తుంది జ్యోత్స్న. సార్ నాకు తెలిసిన మనిషి.. నేను ఆ పని చేయనని చెప్తాడు డ్రైవర్. వస్తావా? వెళ్లమంటావా అని అడుగుతాడు సూరజ్. తప్పక ఆటో ఎక్కుతుంది జ్యోత్స్న.

78
సుమిత్ర కంగారు

మరోవైపు జ్యోత్స్న గురించి కంగారు పడుతుంటుంది సుమిత్ర. చెప్పకుండా వెళ్లొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఫోన్ కూడా కనెక్ట్ కావట్లేదు అని అంటుంది సుమిత్ర. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఉంటుంది అని దశరథ, శివన్నారాయణ చెప్పినా సుమిత్ర వినదు. ఇక చేసేదేమి లేక కార్తీక్ కు ఫోన్ చేస్తాడు దశరథ.

88
దీప కోపం

ఆ ఫోన్ ఎవరో చూడు అని దీపకు చెప్తాడు కార్తీక్. మా నాన్న కాల్ చేస్తున్నాడు అంటుంది దీప. ఫోన్ లిఫ్ట్ చేయగానే జ్యోత్న్స అక్కడికి వచ్చిందా కార్తీక్ అని అడుగుతాడు దశరథ. రాలేదని చెప్తాడు కార్తీక్. జరిగిన విషయం చెప్తే.. మీరు కంగారు పడకండి నేను కనుక్కుంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఈ మనిషి మా అమ్మానాన్నలను ప్రశాంతంగా ఉండనివ్వదని ఆవేశపడుతుంది దీప. ముందు జ్యోత్స్న ఎక్కడికి వెళ్లిందో తెలుసుకోవాలి అంటాడు కార్తీక్. ఎలా తెలుసుకుంటాం అంటుంది దీప. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories