Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ

Published : May 26, 2026, 07:41 PM IST

Sri Satya: బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది నటి శ్రీసత్య. ఆ తర్వాత ఆమె రేంజ్‌ మారిపోయింది. సీరియల్స్, టీవీ షోస్‌ తో బిజీగా ఉండే ఆమె ఇప్పుడు కొత్త జర్నీ స్టార్ట్ చేస్తోంది. 

PREV
13
బిగ్ బాస్‌ షోతో పాపులర్‌ అయిన శ్రీ సత్య

శ్రీసత్య.. టీవీ నటిగా పాపులర్‌ అయ్యింది. ఆమె `నిన్నే పెళ్లాడతా`, `అత్తారింట్లో అక్కా చెల్లెలు`, `త్రినయని` వంటి సిరీయల్స్ తో నటించి మెప్పించింది. విశేష పాపులారిటీని  సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె  బిగ్‌ బాస్‌ తెలుగు షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్‌ బాస్‌ తెలుగు 6వ సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. హౌస్‌లో ఆమె ప్రవర్తన, నిజాయితీ, టాస్కుల్లో చూపిన పోటీ తత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఫ్యామిలీ విషయాలు, ఎమోషనల్‌ జర్నీ ఆకట్టుకున్నాయి. 

23
శ్రీ సత్య యాంకర్‌గా కొత్త జర్నీ

సోషల్ మీడియాలో కూడా శ్రీ సత్య ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకుంటూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఫ్యాషన్, స్టైలిష్ లుక్స్ పరంగానూ ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పలు టీవీ షోస్‌లో సందడి చేస్తున్న ఆమె కొత్త జర్నీ స్టార్ట్ చేసింది. యాంకర్‌గా టర్న్ తీసుకుంది. `విహారి ఓటీటీ` సరికొత్త ట్రావెల్‌ ప్లాట్‌ ఫామ్‌ కి యాంకర్‌గా చేయబోతుంది. జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ ఇది. దీన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరించారు.

33
కాన్స్ ఫెస్టివల్‌లో ట్రావెల్‌ ఓటీటీ `విహారి ఓటీటీ` ప్రారంభం

 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో విహారి OTT టీమ్ ప్రత్యేక ప్రివ్యూ విడుదల చేసింది. దీంతో తెలుగు డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రావెల్ స్టోరీల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది.18 ఏళ్లుగా ట్రావెల్ కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విహారి, ఇప్పుడు పూర్తిస్థాయి గ్లోబల్ ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది. తెలుగు మీడియాలో ట్రావెల్ షోలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విహారి, ప్రపంచంలోని పర్యాటక ప్రదేశాలు, సంస్కృతి, సంప్రదాయాలు, రుచులు, ప్రత్యేకతలను ప్రేక్షకులకు చేరవేసింది. ఇప్పటికే టెలివిజన్ ద్వారా ఎన్నో అద్భుతమైన ప్రయాణ కథనాలు అందించిన విహారి, ఇప్పుడు OTT రూపంలో మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు భాషలో ట్రావెల్‌కు మాత్రమే అంకితమైన తొలి OTT ప్లాట్‌ఫామ్‌గా విహారి OTT జూన్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories