Published : Feb 21, 2026, 05:14 PM ISTUpdated : Feb 21, 2026, 05:16 PM IST
తెలుగు బుల్లితెర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన కార్తీకదీపం2 మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. రెండో సీజన్‌గా ప్రసారమవుతున్న ‘కార్తీకదీపం ఇది నవ వసంతం’ ఈ శనివారంతో అద్భుతం చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే?
చాలా ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఫస్ట్ సీజన్ అద్భుతమైన రెస్పాన్స్ సాధించి.. టాప్ లో నిలిచింది. ఇక సెకండ్ సీజన్ కూడా అంతకు మించిన రెస్పాన్స తో దూసుకుపోతోంది. తాజాగా కార్తీకదీపం సీజన్ 2 సీరియల్ సరికొత్త చరిత్రను సృష్టించింది. తాజాగా 600 ఎపిసోడ్స్ ను కంప్లీట్ చేసుకుంది ఈ సందర్భంగా Star Maa తన ఎక్స్ ఖాతా ద్వారా అధికారిక ప్రకటన చేస్తూ ప్రత్యేక పోస్టర్, ప్రోమోను విడుదల చేసింది.
25
కార్తీకదీపం 600 ఎపిసోడ్స్
స్టార్ మా ట్వీట్ లో ఏముందంటే..? “మన మనసుల్లో చెరగని ముద్ర వేసిన కార్తీకదీపం 600 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఈ విజయానికి కారణమైన ప్రేక్షకుల ప్రేమకు ధన్యవాదాలు” అంటూ స్టార్ మా పోస్ట్ చేసింది. మరో ప్రోమోలో “600 ఎపిసోడ్స్, చిరస్మరణీయమైన ప్రేమ.. ఈ అందమైన ప్రయాణానికి తోడైన అభిమానులందరికీ కృతజ్ఞతలు” అంటూ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపింది.
35
కార్తీకదీపం2 ఇది నవ వసంతం
సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు రాత్రి 8 గంటలకు స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ను ఓటీటీ లో Jio Hotstar లో కాస్త ముదుగానే చూసే అవకాశం ఉంది. కార్తీకదీపం తొలి సీజన్ 1500కు పైగా ఎపిసోడ్లతో తెలుగు టెలివిజన్ చరిత్రలో రికార్డు సృష్టించింది. వంటలక్క (దీప) – డాక్టర్ బాబు (కార్తీక్) జంట ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది. ఆ జోడీని మళ్లీ తెరపై చూడాలనుకున్న అభిమానుల కోరిక మేరకు రూపొందిన సీజన్2 ‘ఇది నవ వసంతం’ కూడా అదే స్థాయిలో ఆదరణ పొందుతోంది.
ప్రస్తుతం ఈ సీరియల్ స్టార్ మాలో టాప్ టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతోంది. కుటుంబ ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. 600వ ఎపిసోడ్ కథలో కీలక మలుపుగా నిలిచింది. సుమిత్ర అసలు కూతురు జ్యోత్స్న కాదు, దీప అనే నిజం దశరథకు తెలిసిపోవడం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. పారిజాతం చేసిన పసిబిడ్డల మార్పిడి గుట్టు రట్టవడంతో కుటుంబ సంబంధాలు కుదేలయ్యాయి. తల్లి సుమిత్ర ప్రాణాలను కాపాడటానికి దీప తన గర్భంలోని బిడ్డను పణంగా పెట్టే క్లిష్ట పరిస్థితుల్లో పడింది.
55
కార్తీకదీపం 2 లో పాత్రలు ఇవే..?
ఈ సీరియల్‌లో కార్తీక్ బాబు పాత్రలో నిరుపం పరిటాల, దీప గా ప్రేమి విశ్వనాథ్, జ్యోత్స్నగా ప్రియాంక, దశరథగా సుభాష్, పారిజాతం పాత్రలో సుమిత్ర నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమి విశ్వనాథ్ మళ్లీ దీప పాత్రలోకి రావడం ఈ సీజన్ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొదటి సీజన్‌లో మోనిత పాత్ర ఎంతటి విలనీని పండించిందో, ఈ సీజన్‌లో జ్యోత్స్న పాత్ర అదే స్థాయిలో ప్రతికూల ఛాయలను తెరపై ఆవిష్కరిస్తోంది.