సుహాస్ హీరోగా, శివానీ నగరం హీరోయిన్‌గా నటించిన చిత్రం `హే బలవంత్`. గోపీ అచ్చర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వీకే నరేష్, సుదర్శన్, వెన్నెల కిశోర్, అజయ్ ఘోష్, యాంకర్ స్రవంతి, హర్షవర్థన్ ముఖ్య పాత్రలు పోషించారు. బీ నరేంద్ర రెడ్డి నిర్మించారు. ఈ మూవీని వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి. మంచి రివ్యూస్ వచ్చాయి.