Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. హిమ వాళ్ళ మమ్మీ ను కారు ఎక్కమని కారు స్టార్ట్ చేస్తుంది. కానీ కొంత దూరం వెళ్ళిన తరువాత ఆ కారు హిమ (Hima) కు హ్యాండిల్ చేయడం కుదరదు.
ఇక ఆ కారులోకి కార్తీక్ (Karthik) పరిగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ ఆ కారు అదుపుతప్పి ఒక అడవిలో ఒక లోయలోకి బోల్తా కొడుతుంది. అంతేకాకుండా అక్కడికక్కడే బ్లాస్ట్ అవుతుంది. దాంతో కారులో ఉన్న ముగ్గురు మరణిస్తారు. సౌర్య (Sourya) మాత్రమే బయట ఉండి ఏడుస్తూ కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతుంది.
26
Karthika Deepam
ఇక వీరు ముగ్గురు చనిపోయిన విషయాన్ని లక్ష్మణ్ (Laxman) దంపతులు వార్తల ద్వారా తెలుసుకుంటారు. వెంటనే వాళ్లు మోనిత దగ్గరికి వెళ్లి డాక్టర్ బాబు చనిపోయాడని లక్ష్మణ్ చెబుతాడు. దాంతో మోనిత (Monitha) ఒకేసారి స్టన్ అవుతుంది.
36
Karthika Deepam
ఇక బస్తీవాసులు సౌందర్య (Soundarya) ఇంటికి వెళ్లి ఇక మాకు దిక్కేవరమ్మ అంటూ ఏడుస్తూ ఉంటారు. ఇక సౌర్య (Sourya) ను ఇంటికి తీసుకొని వచ్చిన సౌందర్య దంపతులు.. పంతులు గారికి భాదను చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు.
46
Karthika Deepam
ఈ కార్యక్రమంలో కార్తీక్ దంపతులకు, హిమ (Hima) ఫోటోకు దండవేసి బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలో కార్తీక్ వాళ్ళ అక్క వచ్చి నీ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయింది ఏంట్రా అంటూ కార్తీక్ (Karthik) ఫోటోను చూస్తూ ఏడుస్తుంది.
56
Karthika Deepam
ఈ లోపు మోనిత (Monitha) అక్కడకు విధవరాలిగా తెల్ల చీర కట్టుకొని వస్తుంది. అంతేకాకుండా సౌందర్య కుటుంబమే చనిపోవడానికి కారణం అంటూ ఏడుస్తుంది. అంతేకాకుండా కార్తీక్ (Karthik)కు మీరు ఎంత ఖర్చు పెట్టారో నాకు ఎప్పుడూ చెప్పుకుంటూ బాధపడేవాడు అంటూ మోనిత ఏడుస్తూ చెబుతుంది.
66
Karthika Deepam
ఆ తర్వాత అనుకోకుండా సౌందర్య (Soundrya) ఇంటికి హిమ రాగా ఈ లోపు సౌర్య.. హిమ ఫోటోను నేలపై గట్టిగా ఎత్తేసి హిమ.. అమ్మా నాన్న లను మింగేసిన రాక్షసి అంటూ ఏడుస్తుంది. ఇక అది విన్న హిమ (Hima) అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక తరువాయి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.