ఈరోజు ఎపిసోడ్లో సౌర్య అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్లావు అని ఇంద్రుడు అడగగా ఏమీ లేదు బాబాయ్ జిరాక్స్ షాప్ దగ్గరికి వెళ్లాను అని అనడంతో ఎందుకమ్మా అనడంతో వీటి కోసం వెళ్ళాను బాబాయ్ అని సౌర్య తన చేతిలో ఉన్న పోస్టర్స్ ఇంద్రుడికి చూపించడంతో ఇంద్రుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. పోచస్ లో అమ్మ నాన్న ఫోటోలు వేయిద్దాం అంటే నా దగ్గర వాళ్ళ ఫొటోస్ లేవు అందుకే నా ఫోటో వేయించి నీ ఫోన్ నెంబర్ ఇచ్చాను బాబాయ్ ఈ సంగారెడ్డి మొత్తం ఈ పోస్టర్లు అతికిద్దాం అమ్మ నాన్నలు ఇక్కడికి వస్తే నీ నెంబర్ కచ్చితంగా ఫోన్ చేస్తారు అనడంతో ఇంద్రుడు ఏం మాట్లాడాలో తెలియక సరే అమ్మ అని అంటాడు.